Homeఎక్స్ క్లూసివ్రాంగోపాల్ వర్మ కు వార్నింగ్ ఇచ్చిన బాలయ్య

రాంగోపాల్ వర్మ కు వార్నింగ్ ఇచ్చిన బాలయ్య

Balakrishna warns ramgopal varma
Nandamuri Balakrishna

వెన్నుపోటు అంటూ నిన్న రాంగోపాల్ వర్మ విడుదల చేసిన పాట సంచలనం సృష్టిస్తోంది . తెలుగుదేశం శ్రేణులను దహించి వేస్తుండటంతో ఎక్కడికక్కడ రాంగోపాల్ వర్మ దిష్టి బొమ్మలను తగులబెడుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు . అయితే వెన్నుపోటు అనే పాటలో చంద్రబాబు నాయుడు ఫోటోలను వాడటంతో బాలయ్యకు పట్టరాని కోపం వచ్చిందట అంతే ! వర్మ కు వార్నింగ్ ఇస్తూ ఓ ఆడియో పంపించాడట బాలయ్య . అందులో ఒరేయ్ ! రాంగోపాల్ వర్మ అంటూ తిట్టడంతో దానికి అదే స్థాయిలో సమాధానం ఇచ్చాడు వర్మ .

అయితే బాలయ్య వర్మ ని తిట్టాడు కానీ వర్మ మాత్రం బాలయ్య ని బాలకృష్ణ గారు అంటూ సంబోధించడం విశేషం . అయితే బాలయ్య నేరుగా వర్మ ని తిట్టలేదు కానీ ఎవరో బాలయ్య వాయిస్ తో వర్మ కు వార్నింగ్ ఇచ్చిన ఆడియో ఇప్పుడు హల్చల్ చేస్తోంది . బాలయ్య సినిమాలో అతిరధ మహారథులైన నటీనటులు నటించారు కానీ రాంగోపాల్ వర్మ చిత్రంలో మాత్రం అలాంటి వాళ్ళు ఎవరు లేరు కాకపోతే 1995 లో జరిగిన వెన్నుపోటు న దాగి ఉన్న సత్యాలను చెబుతానని అంటున్నాడు వర్మ . ఈ లొల్లి ఎప్పుడు ముగుస్తుందో కానీ నిన్నటి నుండి లొల్లి మొదలయ్యింది ….. ఎన్టీఆర్ బయోపిక్ , లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలు విడుదల అయ్యేంత వరకు ఈ గొడవ జరుగుతూనే ఉంటుంది .

- Advertisement -

English Title : Balakrishna warns ramgopal varma

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All