Homeటాప్ స్టోరీస్వెబ్ షో హోస్ట్ గా మారనున్న బాలయ్య

వెబ్ షో హోస్ట్ గా మారనున్న బాలయ్య

వెబ్ షో హోస్ట్ గా మారనున్న బాలయ్య
వెబ్ షో హోస్ట్ గా మారనున్న బాలయ్య

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సినిమాల పరంగా బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా అఖండ షూటింగ్ ను పూర్తి చేసాడు బాలకృష్ణ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటించనున్నాడు. దీనికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ నడుస్తోంది. ఇదిలా ఉంటే నందమూరి బాలకృష్ణ ఇప్పుడు వెబ్ హోస్ట్ గా మారుతున్నాడట.

ఆహా కోసం ఒక వెబ్ షో ను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సామ్ జామ్ టాక్ షో ను విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం మరో టాక్ షో ను కూడా ప్లాన్ చేసారు. దీనికి ఎవరూ ఊహించని విధంగా నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా మారతాడని తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ తనదైన స్టైల్ లో ఈ సెలబ్రిటీ టాక్ షో ను నిర్వహించనున్నారు.

- Advertisement -

తొలిసారి ఓటిటి డెబ్యూ చేస్తున్నాడు. ఈ షో ను చారిటీ కోసం బాలయ్య ఉపయోగిస్తున్నాడని తెలుస్తోంది. ఈ షోకు రెమ్యునరేషన్ ద్వారా వచ్చిన డబ్బుని చారిటికి ఇస్తాడని సమాచారం. అలాగే ఈ షో సరికొత్తగా ఉంటుందని, భిన్నమైన ప్రోగ్రామ్స్ ఉంటాయని తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All