Homeగాసిప్స్వచ్చే ఏడాది బాలయ్య అభిమానులకు స్వీట్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడా?

వచ్చే ఏడాది బాలయ్య అభిమానులకు స్వీట్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడా?

వచ్చే ఏడాది బాలయ్య అభిమానులకు స్వీట్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడా?
వచ్చే ఏడాది బాలయ్య అభిమానులకు స్వీట్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడా?

నందమూరి బాలకృష్ణది హీరోగా విలక్షణ శైలి. ఆయన ఏం చేసినా స్పెషల్ గా ఉంటుంది. డీసెంట్ అంచనాల మధ్య నందమూరి బాలకృష్ణ నటించిన రూలర్ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిమానులకు నచ్చే అన్ని అంశాలు ఉన్న చిత్రంగా పేరు తెచ్చుకుంది. పూర్తి టాక్ తెలియాలంటే మరికొంత సమయం పడుతుంది. ఇక రూలర్ సంగతి పక్కనపెడితే బాలకృష్ణ తన తర్వాతి సినిమాను కూడా మొదలుపెట్టిన సంగతి తెల్సిందే. తనకు రెండు సూపర్ హిట్లు ఇచ్చిన బోయపాటి శ్రీనుతో చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెల్సిందే. ఈ నెల 26 నుండి షూటింగ్ మొదలుకానుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా కాకుండా బాలయ్య తన అభిమానులకు మరో స్వీట్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు ఇండస్ట్రీలో కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.

ఇప్పటికే 105 సినిమాలు చేసిన బాలకృష్ణకు బోయపాటి చిత్రం 106వ ది. ఈ సినిమా తర్వాత ఈ హీరో కొత్త పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఎప్పటినుండో బాలకృష్ణకు దర్శకత్వంపైన ఆసక్తి ఉంది. ఆ కోరికను వచ్చే ఏడాది తీర్చుకోనున్నాడు. కథ కూడా సిద్ధంగా ఉంది. బాలకృష్ణ కెరీర్ లో ఎప్పుడూ స్పెషల్ గా నిలిచిపోయే చిత్రాల్లో ఆదిత్య 369 ఒకటి. అప్పట్లో తెలుగు ఇండస్ట్రీలో ఉపయోగించే సాంకేతికతను మించిన టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. ఇప్పటికీ ఈ చిత్రం ఎంతో స్పెషల్ గా నిలుస్తోంది. ఈ చిత్రాన్ని రూపొందించిన సింగీతం శ్రీనివాసరావు గత కొన్నేళ్లుగా ఈ కథను బాలయ్యతో తీయాలని ప్రయత్నాలు చేసారు. టైటిల్ గా ఆదిత్య 999 కూడా ఫిక్స్ చేసారు.

- Advertisement -

అయితే కథలో కొన్ని మార్పులను బాలయ్య సూచించడం, తర్వాత గౌతమీపుత్ర శాతకర్ణి వంటి హిస్టారికల్ ఫిల్మ్ రావడంతో ఈ కథ మరుగునపడిపోయింది. అయితే ఇప్పుడు బాలకృష్ణ ఇదే కథతో తన స్వీయ దర్శకత్వంలో ఆదిత్య 999ను వచ్చే ఏడాది పట్టాలెక్కించబోతున్నాడని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది సమ్మర్ లోనే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది. వినడానికి అంతా బానే ఉంది కానీ ఇది నిజంగా నిజమేనా అన్నదే తెలియాల్సి ఉంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All