Homeన్యూస్బాలయ్య టాక్ షో.. దబిడి దిబిడే..!

బాలయ్య టాక్ షో.. దబిడి దిబిడే..!

Balakrishna Talk Show for Aha OTT
 

నందమూరి బాలకృష్ణ ఏంటి టాక్ షో ఏంటని ఆశ్చర్యపోవచ్చు.. బాలయ్య బాబు టాక్ షో చేస్తే ఎలా ఉంటుంది.. నందమూరి ఫ్యాన్స్ కు పండుగే అని చెప్పొచ్చు. ఆహాలో బాలకృష్ణ టాక్ షో ఉంటుందని అంటున్నారు. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అన్నది తెలియాల్సి ఉంది. నందమూరి బాలకృష్ణ ఆహా ఓటీటీలో స్పెషల్ టాక్ షో చేస్తారన్న న్యూస్ వైరల్ గా మారింది. ఈమధ్య సినిమాలతో పాటుగా స్టార్స్ కూడా ఓటీటీల మీద పడుతున్నారు.

ముఖ్యంగా అగ్ర తారలు సైతం ఓటీటీలో స్పెషల్ షోస్ చేస్తున్నారు. ఇప్పుడు అదే దారిలో బాలయ్య బాబు కూడా టాక్ షో ఒకటి చేయబోతున్నారని అంటున్నారు. బాలకృష్ణ టాక్ షో అంటే అది దబిడి దిబిడే అన్నట్టు ఉంటుందని చెప్పుకుంటున్నారు. సినిమాల్లో డైలాగ్స్ తో అదరగొట్టే బాలకృష్ణ టాక్ షోలో ఎలా విజృంభిస్తాడో చూడాలి. ఇక బాలయ్య బాబు సినిమాల విషయానికి వస్తే బోయపాటి శ్రీను డైరక్షన్ లో చేస్తున్న అఖండ షూటింగ్ కు పూర్తి చేసి రిలీజ్ కు రెడీ అవుతుంది.

- Advertisement -

బాలకృష్ణ తన నెక్స్ట్ సినిమా.. గోపీచంద్ మలినేని డైరక్షన్ లో చేస్తున్నాడు. క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని అదే తరహాలో బాలకృష్ణతో సినిమా చేస్తున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All