
టాలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రాల హవా నడుస్తోంది. దీంతో హీరోలతో పాటు దర్శకనిర్మాతలు కూడా ఈ తరహా చిత్రాలంటే ఆసక్తి చూపిస్తున్నారు. ఇద్దరు హీరోలతో సినిమా అంటే బిజినెస్ పరంగా ప్రాజెక్ట్ సేఫ్ కాబట్టి నిర్మాతలు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇదే ఫార్ములాతో యంగ్ హీరో నాగశౌర్యతో శ్రీదేవి మూవీస్ అధినేతి శివలెంక కృష్ణ ప్రసాద్ ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.
స్టోరీ డిమాండ్ మేరకు ఈ మూవీలోని కీలక పాత్రలో ఓ స్టార్ హీరో నటించాల్సి వుంది. ఆ పాత్రలో స్టార్ హీరో బాలకృష్ణ నటిస్తే ఈ ప్రాజెక్ట్‌కే మంచి క్రేజ్ ఏర్పడుతుందని భావించిన నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ హీరో బాలకృష్ణను సంప్రదించారని, క్యారెక్టర్ నచ్చడంతో బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ మూవీలో నటించడానికి బాలకృష్ణ ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. కారణం తను డిమాండ్ చేసిన పారితోషికం ఇస్తేను యంగ్ హీరో నాగశౌర్యతో కలిసి నటిస్తానని బాలకృష్ణ కండీషన్ పెట్టారట. అంత అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేని నిర్మాత తన ప్రయత్నాలని విరమించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. శివలెంక కృష్ణ ప్రసాద్ శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై బాలకృష్ణతో ఆదిత్య 367, వంశానికొక్కడు వంటి హిట్ చిత్రాల్ని అందించారు.