Homeఎక్స్ క్లూసివ్అన్ స్టాపబుల్: మొదటి ఎపిసోడ్ చిత్రీకరణ పూర్తి చేసిన బాలయ్య

అన్ స్టాపబుల్: మొదటి ఎపిసోడ్ చిత్రీకరణ పూర్తి చేసిన బాలయ్య

అన్ స్టాపబుల్: మొదటి ఎపిసోడ్ చిత్రీకరణ పూర్తి చేసిన బాలయ్య
అన్ స్టాపబుల్: మొదటి ఎపిసోడ్ చిత్రీకరణ పూర్తి చేసిన బాలయ్య

అందరినీ సర్ప్రైజ్ చేస్తూ నందమూరి బాలకృష్ణ డిజిటల్ డెబ్యూ చేస్తోన్న విషయం తెల్సిందే. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా కోసం అన్ స్టాపబుల్ అనే టాక్ షో ను హోస్ట్ చేయనున్నాడు బాలయ్య. రీసెంట్ గా ఈ షో లాంచ్ అట్టహాసంగా లాంచ్ చేసారు. నవంబర్ 4 నుండి ఈ షో ప్రీమియర్స్ ఉంటాయని అధికారికంగా ప్రకటించారు. ఈ షో కోసం బాలయ్య సరికొత్త లుక్ లో దర్శనమివ్వనున్నాడు.

తాజా సమాచారం ప్రకారం అన్ స్టాపబుల్ మొదటి ఎపిసోడ్ చిత్రీకరణ పూర్తయింది. మొదటి ఎపిసోడ్ కు చీఫ్ గెస్ట్ లుగా మంచు ఫ్యామిలీ వచ్చినట్లు తెలుస్తోంది. మంచు మోహన్ బాబుతో బాలయ్య రీసెంట్ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఎపిసోడ్ చాలా బాగా వచ్చినట్లు, బాలయ్య స్టైల్ లో ఫన్ ప్రేక్షకులకు సరికొత్తగా అనిపించనున్నట్లు సమాచారం.

- Advertisement -

ఇక ఈ టాక్ షో కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న బాలయ్య దాన్ని సేవా కార్యక్రమాల కోసం వినియోగించనున్నట్లు తెలుస్తోంది. మొత్తం అన్ స్టాపబుల్ 12 ఎపిసోడ్స్ గా ప్లాన్ చేశారట. ఇక ఏ ఏ సెలబ్రిటీస్ ఈ టాక్ షో కు వచ్చి బాలయ్యతో రచ్చ చేస్తారన్నది చూడాలి.

ఇక సినిమాల విషయానికొస్తే అఖండ షూటింగ్ ను పూర్తి చేసిన బాలకృష్ణ, గోపీచంద్ మలినేనితో యాక్షన్ డ్రామాకు శ్రీకారం చుట్టాల్సి ఉంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All