
నందమూరి బాలకృష్ణ రీసెంట్ గా అఖండ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తన 107 మూవీ చేస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా..థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఇదిలా ఉంటె బాలకృష్ణ గత కొద్దీ రోజులుగా మోకాలి నొప్పి తో బాధపడుతున్నాడు. ఈ నొప్పి తీవ్రం కావడం తో సర్జరీ చేయించుకున్నాడు. బాలయ్యకు జరిగింది చిన్న ఆపరేషన్ అని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు స్పష్టం చేశారు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. మరోవైపు ఆసుపత్రిలో డాక్టర్లతో పాటు బాలయ్య దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో కూడా బాలయ్య భుజానికి ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే.