
అనిల్ రావిపూడి – నందమూరి బాలకృష్ణ కలయికలో సినిమా రాబోతుందని గత కొన్ని నెలలుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ సినిమా మాత్రం కార్య రూపం దాల్చుకోవడం లేదు. ప్రస్తుతం బాలకృష్ణ 107 వ మూవీ క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో చేస్తున్నాడు. దీని తర్వాత ఖచ్చితంగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతున్న వేళ..దీనిపై క్లారిటీ వచ్చింది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ సినిమాని ఆగస్టులో పట్టాలెక్కించబోతున్నారట. బాలకృష్ణ – అనిల్ రావిపూడి శైలికి తగ్గట్టుగా మాస్ అంశాలతో కూడిన స్క్రిప్ట్‌ని సిద్ధం చేసినట్టు సమాచారం. బాలకృష్ణ – గోపీచంద్ మలినేని సినిమాకి సంబంధించి మరో కొత్త కబురు వినిపిస్తోంది. బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని జూన్ 10న టీజర్‌ని విడుదల చేయనున్నట్టు సమాచారం.
ప్రస్తుతం అనిల్ రావిపూడి వెంకటేష్ – వరుణ్ తేజ్ లతో ఎఫ్ 3 మూవీ చేసాడు. ఈ చిత్రం మే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీ లో తమన్నా, మెహ్రీన్ లతో పాటు సోనాల్ చౌహన్ మరో హీరోయిన్ గా నటించగా, పూజా హగ్దే ఐటెం సాంగ్ లో నటించింది.