
నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబో అంటే అభిమానులకే పండగే. వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహ , లెజెండ్ , అఖండ మూవీస్ భారీ విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. దీంతో వీరి కాంబో అంటే అభిమానులకే పడ్డ పండగే. అఖండ తరువాత వీరిద్దరి కాంబో లో అఖండ 2 రాబోతుందనే వార్తలు ఆ మధ్య సోషల్ మీడియా లో వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ ఆ మూవీ ఫై క్లారిటీ లేదు.
తాజాగా వీరిద్దరి కాంబో లో సినిమా రాబోతుందనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఈ సారి చేసే సినిమా ‘లెజెండ్’ మాదిరిగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండాలని బాలయ్య సూచించినట్లు టాక్. బాలయ్య సూచన మేరకు బోయపాటి శ్రీను ప్రస్తుతం స్టోరిపైన కాన్సంట్రేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కొంత టైం పడుతుందని, ఆ లోపు బోయపాటి రామ్ పోతినేనితో చిత్రం పూర్తి చేయాలని అనుకుంటున్నారు. బాలయ్య సైతం గోపీచంద్ మలినేని సినిమా కంప్లీట్ చేయనున్నారు. ఈ సినిమాలు పూర్తి అయ్యాక బాలయ్య సినిమా సెట్స్ పైకి రానుందని అంటున్నారు.