Tuesday, August 16, 2022
Homeటాప్ స్టోరీస్బాలయ్య జడ్జిమెంట్ కి బలి అవ్వనున్న రౌడీలు

బాలయ్య జడ్జిమెంట్ కి బలి అవ్వనున్న రౌడీలు

బాలయ్య జడ్జిమెంట్ కి బలి అవ్వనున్న రౌడీలు.
బాలయ్య జడ్జిమెంట్ కి బలి అవ్వనున్న రౌడీలు.

కె.ఎస్.రవికుమార్- బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ‘జై సింహా’ 2018 సంక్రాంతి రేస్ లో పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమాకి పోటీగా విడుదల అయ్యి ఒక మోస్తరు హిట్ సినిమాగా నిలవగా ఇక బాలయ్య బాబు తనలోని మంచి నటనని కనబరిచి జనాల మెప్పు పొందారు.

- Advertisement -

ఇప్పుడు అదే కాంబినేషన్ లో మళ్ళి కలిసి చేస్తున్న సినిమా ‘ఎన్.బి.కె 105’. ప్రస్తుతానికి సినిమా పేరు ఇంకా ఖరారు చేయలేదు అందుకే నందమూరి అభిమానులకి సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. మొన్నటి దాకా ‘రూలర్’, ‘క్రాంతి’ పేర్లు అనుకున్న ఈ సినిమాకి ఇప్పుడు ‘జడ్జిమెంట్’ అనే పేరు అనుకుంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. అది కూడా ఇంకా అధికారకంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు.

అయితే దర్శకులు రవికుమార్ గారు సినిమాకి, బాలయ్య క్యారక్టర్ కి ధీటుగా జడ్జిమెంట్ పేరు కరెక్ట్ గా సూట్ అవుతుంది అని నిర్మాత సి.కళ్యాణ్ గారికి చెప్పారంటా. మరి జడ్జిమెంట్ టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేయిస్తారా? లేక సినిమాకి ఇంకొక పేరు ఎమన్నా ఆలోచిస్తారా అంటే? ఇంకొన్ని రోజులు ఆగక తప్పదు.

దసరా రోజు కూడా బాలకృష్ణ కొత్త లుక్ ఉన్న పోస్టర్ రిలీజ్ చేసారు కానీ సినిమా పేరు చెప్పకపోయేసరికి బాలయ్య అభిమానులు కొంత నిరుస్తాహం చెందారు. డిసెంబర్ 20 వ తేదీన సినిమాని విడుదల చేయాలి అనికుంటున్నారు. సినిమాలో వేదిక, సోనాల్ చౌహన్ కథానాయకులు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts