
భారతీయ సినీ చరిత్రని సరికొత్త మలుపు తిప్పిన చిత్రం `బాహుబలి`. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని, తెలుగు వారి సత్తాని ఖండాంతరాలకు చాటింది. ఈ సినిమాతో హీరో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. వరల్డ్ వైడ్‌గా 2 వేలకు పైగా వసూళ్లని సాధించిన ఏకైక చిత్రంగా చరిత్ర సృష్టించింది. ప్రభాస్‌తో పాటు అనుష్క, రానా, దర్శకుడు రాజమౌళి కెరీర్‌నే మలుపుతిప్పింది.
తెలుగు సినిమా గమనాన్ని, మార్కెట్ స్థాయిని పెంచిన ఈ సినిమాకు శ్రీకారం చుట్టింది ఈ రోజే. సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే జూలై 6న ప్రారంభమైంది. కర్నూలు లోని ఫేమస్ రాక్ గార్డెన్‌లో వేలాది ప్రేక్షకుల మధ్య అట్టహాసంగా మొదలైంది. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం అవుతోందని తెలిసి చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు. ఆ నాటి దృశ్యాలు ఇప్పటికీ ప్రత్యేకంగా నిలిచాయి.
ఏడేళ్ల క్రితం సరిగ్గా ఈ రోజు `బాహుబలి` షూటింగ్ ప్రారంభించిన రోజు కావడంతో ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఆరోజు దృశ్యాలని సోషల్ మీడియా వేదికగా బాహుబలి టీమ్ పంచుకుంది. 2013లో మొదలైన ఈ చిత్రం 2015 జూలై 15న విడుదలైన విషయం తెలిసిందే.
July 6, 2013. The moment when it all began!
We started the shoot of #Baahubali on this day 7 years ago… ✊? pic.twitter.com/JQmbRuplki
— Baahubali (@BaahubaliMovie) July 6, 2020