
కట్ చేస్తే ఇప్పుడు బాహుబలి పుణ్యమా అని ప్రభాస్ కు కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రభాస్ యాక్షన్ కు జపాన్ ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. బాహుబలి 2 లో యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో ఆర్కా మీడియా సంస్థ నిర్మించిన విషయం తెలిసిందే. జపాన్ లో తమ చిత్రం వంద రోజులను పూర్తిచేసుకోవడంతో ఆ సంతోషాన్ని అభిమానులతో పంచుకోవడానికి బాహుబలి అఫీషియల్ పేజీలో పోస్ట్ చేసారు. ఇక ఇక్కడి అభిమానులు కూడా ప్రభాస్ సినిమా జపాన్ లో కూడా సూపర్ హిట్ కావడంతో చాలా సంతోషంగా ఉన్నారు.
HEYSSAAA… RUDHRASSAA… #Baahubali2 #Baahubali2inJapan
Had GOOSEBUMPS all throughout while watching this video. ????
Thank you Japan for the love you all showed for our film over 100 days of its release. ???????????????????????? Jai Maahishmati…. pic.twitter.com/5Cd4MfdQUt— Baahubali (@BaahubaliMovie) April 26, 2018