Homeటాప్ స్టోరీస్హీరో కొంప ముంచిన లిప్ లాక్

హీరో కొంప ముంచిన లిప్ లాక్

Ayushman khurana lip lock with heroine life in difficultఓ హీరోయిన్ తో హీరో లిప్ లాక్ చేసిన తీరుకి ఆ హీరో కొంప కొల్లేరు అయ్యిందట ! ఈ విషయాన్నీ తానే స్వయంగా వెల్లడించాడు . ఇంతకీ లిప్ లాక్ తీసుకున్న హీరోయిన్ ఎవరు ? లిప్ లాక్ చేసిన హీరో ఎవరు ? అనే కదా మీ డౌట్ . లిప్ లాక్ తీసుకున్న భామ యామి గౌతమ్ కాగా లిప్ లాక్ ఇచ్చిన హీరో ఆయుష్మాన్ ఖురానా . ఈ ఇద్దరూ కలిసి విక్కీ డొనర్ అనే చిత్రంలో నటించగా సందర్భానుసారంగా వచ్చే లిప్ లాక్ అప్పట్లో సంచలనం సృష్టించింది . అయితే అంతటి మధురమైన లిప్ లాక్ ఎవరికో ఇచ్చావ్ నాకు మాత్రం ఆ రేంజ్ లో ఇవ్వలేదు అని ఫీల్ అయ్యిందో ఏమో కానీ హీరో గారిని పట్టుకొని చెడా మడా తిట్టేసి అతడ్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందట . ఎంత బ్రతిమిలాడినా రాలేదట ! చివరకు మూడేళ్ళ తర్వాత కోపం తగ్గి మళ్ళీ ఆయుష్మాన్ ఖురానా తో కాపురం చేస్తోందట తాహీర కశ్యప్ .

ఈ విషయాన్నీ తాజాగా బదాయి హో అనే చిత్ర సక్సెస్ మీట్ లో వెల్లడించాడు ఆయుష్మాన్ ఖురానా . లిప్ లాక్ అంటే అందరూ ముచ్చట పడతారు కానీ ఆ లిప్ లాక్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో మాకు మాత్రమే తెలుసు అని అంటున్నాడు . అయితే యామి గౌతమ్ కు లిప్ లాక్ ఇస్తే అలిగి వెళ్ళిపోయినా భార్య ఇప్పుడు భూమి పెద్నేకర్ కు లిప్ లాక్ ఇస్తే మాత్రం లైట్ గా తీసుకుందట . సినిమా కిస్సే కదా అని లైట్ గా తీసుకుందని , ఆమెకు ఇలాంటి వన్ని అలవాటు అయిపోయానని అంటున్నాడు హీరో . హీరో లిప్ లాక్ ఇస్తే ఇన్ని ఇబ్బందులు ఉంటే మరి హీరోయిన్ ల పరిస్థితి ఏంటో ?

- Advertisement -

English Title : Ayushman khurana lip lock with heroine life in difficult

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All