అ ! రివ్యూ

awe movie reviewనటీనటులు : కాజల్ అగర్వాల్ , నిత్యా మీనన్ , రెజీనా , ఈషా
సంగీతం : మార్క్ కే రాబిన్
నిర్మాత : ప్రశాంతి
దర్శకత్వం : ప్రశాంత్ వర్మ
రేటింగ్ : 3 / 5
రిలీజ్ డేట్ : 16 ఫిబ్రవరి 2018

 

- Advertisement -

హీరో నాని నిర్మాతగా మారి నిర్మించిన ప్రయోగాత్మక చిత్రం ” అ !”. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు రిలీజ్ అయ్యింది . మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

కథ :

ఓ రెస్టారెంట్ నేపథ్యంలో సాగే ఈ కథలో కాలి ( కాజల్ అగర్వాల్ ) తీవ్ర ఒత్తిడికి లోనౌతూ మర్డర్స్ చేయాలనీ ప్రయత్నాలు చేస్తుంటుంది . అదే సమయంలో రకరకాల మనస్తత్వాలు కలిగిన క్రిష్ ( నిత్యా మీనన్ ) రాధా ( ఈషా )మీరా ( రెజీనా )శివ ( అవసరాల శ్రీనివాస్ )నలభీమ ( ప్రియదర్శి )రకరకాల సమస్యలతో బాధపడుతుంటారు . అసలు వీళ్లంతా ఎవరు ? కాలి ఇతరులను చంపాలని ఎందుకు అనుకుంటుంది ? చివరకు ఏమైంది ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

కథ
నటీనటుల పెర్ఫార్మెన్స్
డైరెక్షన్
ఛాయాగ్రహణం
సందేశం

డ్రా బ్యాక్స్ :

అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు లేకపోవడం

నటీనటుల ప్రతిభ :

నిత్యా మీనన్ , ఈషా రెబ్బా , అవసరాల శ్రీనివాస్ , మురళీశర్మ , ప్రియదర్శి తమతమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేసారు , అయితే వీళ్లందరినీ మించేలా కాజల్ అగర్వాల్ , రెజీనా పాత్రలను మలిచాడు దర్శకుడు . నాని , రవితేజ ల వాయిస్ కూడా ఈ సినిమాకు అదనపు ఆకర్షణ అయ్యింది .

సాంకేతిక వర్గం :

కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది , ఎక్కువ లొకేషన్లు లేకుండా పరిమితంగా ఓ రెస్టారెంట్ లోనే ఎక్కువ భాగం షూటింగ్ ఉన్నప్పటికీ ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ప్రతీ ఫ్రేమ్ ని చూడముచ్చటగా మలిచి మెప్పించాడు . రాబిన్ నేపథ్య సంగీతం కూడా ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది . నిర్మాణ విలువలు బాగున్నాయి , ఇక దర్శకుడు ప్రశాంత్ విషయానికి వస్తే …… చిన్న చిన్న లోపాలున్నప్పటికీ అ ! ని జనరంజకంగా మలచడంలో సక్సెస్ అయ్యాడు . నాని నమ్మకాన్ని వమ్ము చేయకుండా అతడి నమ్మకాన్ని నిలిబెట్టాడు .

ఓవరాల్ గా :

కొత్తతరహా చిత్రాలను కోరుకునే ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All