
`చిన్నారి పెళ్లి కూతురు డైలీ సీరియల్‌తో పాపులర్ అయింది అవికా గోర్. ఆ తరువాత తెలుగులో `ఉయ్యాల జంపాల` సినిమాతో వెండితెరకు పరిచయమైంది. నాగార్జున, డి. సురేష్‌బాబుల కారణంగా ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో తెలుగులో హీరోయిన్‌గా తొలి సినిమాతో మంచి గుర్తింపుని దక్కించుకుంది. కొంత విరామం తరువాత `రాజు గారి గది 3`తో రీఎంట్రీ ఇచ్చింది.
ప్రస్తుతం తెలుగులో మరో అవకాశం కోసం ఎదురుచూస్తున్న అవికా తాజాగా సోషల్ మీడియా వేదికగా షాకిచ్చింది. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ తన బాయ్ ఫ్రెండ్‌ని పరిచయం చేసింది. అతని పేరు మిలింద్ చద్వానీ. ఎంటీవీ రౌడీస్ రియల్ హీరోలు 2019 పాపులర్ అయ్యాడు. అతన్ని పరిచయం చేస్తూ అవికా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
`నా ప్రార్థనలకు సమాధానం లభించింది. నా జీవితపు ప్రేమను నేను కనుగొన్నాను!ఈ రకమైన మానవుడు నావాడు. నేను అతని దాన్ని .. ఎప్పటికీ .. మనమందరం మమ్మల్ని అర్థం చేసుకునే, మమ్మల్ని విశ్వసించే, స్ఫూర్తినిచ్చే, ఎదగడానికి..నిజంగా మన కోసం శ్రద్ధ వహించే భాగస్వామికి అర్హులం. కానీ, మనలో చాలామంది అలాంటి భాగస్వామిని కనుగొనడం పొందడం అసాధ్యమని భావిస్తారు.
కాబట్టి ఇది ఒక కలలా అనిపిస్తుంది. కానీ ఇది నిజం! కాబట్టి నిజమైన! మీ అందరి కోసం నేను ప్రార్థిస్తున్నాను .. ఈ రోజు నేను అనుభవిస్తున్నదాన్ని మీరు అందరూ అనుభవించాలని నేను కోరుకుంటున్నాను ..చాలా ఆనందం .. ప్రేమ తో.. నా హృదయం నిండిపోయింది అనే భావన చాలా విలువైనది. నా జీవితంలో చాలా ముఖ్యమైన అధ్యాయం కానున్న ఈ అనుభవాన్ని నాకు ఇచ్చినందుకు నేను దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను … ఇంకా పెళ్లి చేసుకోలేదు.. దానికి ఇంకా తొందర ఏమీ లేదు` అని అవికా గోర్ తన లవర్‌ని పరిచయం చేసింది.