Homeటాప్ స్టోరీస్మొత్తానికి నాని అతడితో సినిమా చేయడానికి రెడీ

మొత్తానికి నాని అతడితో సినిమా చేయడానికి రెడీ

avasarala-srinivas-next-movie-with-naniఅవసరాల శ్రీనివాస్ – నాని ఇద్దరు కూడా

 

- Advertisement -

మంచి స్నేహితులు అన్న విషయం అందరికీ తెలిసిందే . మొదట ఈ ఇద్దరూ కలిసి నటించిన చిత్రం ” అష్టా

చెమ్మా ”. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది అలాగే అప్పటి నుండి అవసరాల శ్రీనివాస్ తో నాని స్నేహం కూడా పెరిగింది . కట్ చేస్తే నాని హీరోగా దూసుకుపోగా అవసరాల శ్రీనివాస్ కమెడియన్ గా రాణించాడు అయితే మధ్యలో తన మేధా శక్తి మేరకు దర్శకుడి అవతారం ఎత్తాడు అవసరాల .

మొదటగా ఊహలు గుసగుస లాడే చిత్రంతో తన అభిరుచి ఏంటో చాటుకున్నాడు అందరి ప్రశంసలు పొందాడు ఆ తర్వాత జ్యో అచ్యుతానంద అనే కమర్షియల్ హిట్ కొట్టి శెభాష్ అనిపించుకున్నాడు . ఆ సినిమా తర్వాత నాని తో సినిమా అనుకున్నాడు కానీ కుదరదే ! అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ ఇన్నాళ్లు నెట్టుకొచ్చాడు కానీ వచ్చే జూన్ లేదా జులై లో మాత్రం తప్పకుండా అవసరాల తో నాని సినిమా ఉంటుందట ! ప్రస్తుతం కృష్ణార్జున యుద్ధం అయిపొయింది , ఇక నాగార్జున తో చేసే సినిమా పూర్తికాకుండానే అది సెట్స్ మీద ఉండగానే అవసరాల సినిమా సెట్స్ మీదకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నాడట నాని . మొత్తానికి ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుందో చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All