Homeటాప్ స్టోరీస్ఆసక్తి కలిగిస్తున్న “అతడే శ్రీమన్నారాయణ”

ఆసక్తి కలిగిస్తున్న “అతడే శ్రీమన్నారాయణ”

ఆసక్తి కలిగిస్తున్న “అతడే శ్రీమన్నారాయణ”
ఆసక్తి కలిగిస్తున్న “అతడే శ్రీమన్నారాయణ”

“ఒక నాయకుడి ప్రస్థానంలో ఎప్పుడూ రెండు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి…! అంతరంగంలో ఒకటీ; రణరంగంలో ఇంకోటీ..!”

ఈ డైలాగ్ కి ఉన్న డెప్త్ ఫిలాసఫీ నన్ను ఈ సినిమా గురించి రాసేలా చేసాయి. “కిరాక్ పార్టీ” సినిమాతో కన్నడ ఇండస్ట్రీ లో సంచలనం కలిగించిన రక్షిత్ శెట్టి ఇప్పుడు ఈ “అతడే శ్రీమన్నారాయణ” సినిమాతో కొత్త సంవత్సరం మొదటి రోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రక్షిత్ శెట్టి కేవలం నటుడుగా మాత్రమే కాకుండా ఈ సినిమా రచయిత కూడా..! గతంలో తన కిరాక్ పార్టీ  లో నటించిన హీరోయిన్ రష్మిక తో పెళ్ల్లి దాకా వెళ్లి కొన్ని అనుకోని కారణాల వల్ల రద్దు చేసుకున్నాడు. అంతే..లే ఈ రోజుల్లో పద్దతిగా పెళ్లి చేసుకుందాం అంటే, ఎవరు కుదురుతారు కానీ..

- Advertisement -

ఇక ఈ సినిమా “అతడే శ్రీమన్నారాయణ” సినిమా ఒక సోషల్ ఫాంటసీ జోనర్ అని అర్ధం అవుతోంది. ఇక నిధి వేట నేపధ్యంలో కొంతమంది బందిపోటులకు, పోలీసులకు మధ్య జరిగే యుద్ధం తాలూకు సన్నివేశాలు గమనించవచ్చు. ఇక సినిమాటోగ్రఫీ తోపాటు ట్రైలర్ చివర్లో వచ్చే బులెట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చూసాక, ఇది ఇక అండర్ రేటెడ్ ఫిలిం అని అర్ధం అవుతోంది.

సచిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి ఈ సినిమాలో పని చేసిన  నటీనటులకు, టెక్నీషియన్స్ కు బ్రేక్ రావాలని కోరుకుందాం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All