Homeటాప్ స్టోరీస్అశ్వ‌థ్ధామ సంక్రాంతి కోడిపందాలు

అశ్వ‌థ్ధామ సంక్రాంతి కోడిపందాలు

అశ్వ‌థ్ధామ సంక్రాంతి కోడిపందాలు
అశ్వ‌థ్ధామ సంక్రాంతి కోడిపందాలు

సంక్రాంతి అంటేనే కోడిపందాల జాత‌ర‌. ఈ పండ‌గ వ‌స్తోందంటే పందాల కోసం చిన్నా పెద్దా అంతా ఏర్పాట్ల‌ల్లో మునిగితేలుతుంటారు. ఊర్ల‌న్నీ పండ‌గ వాతావ‌ర‌ణంతో రెట్టించిన ఉత్సాహంతో క‌ళ‌క‌ళ‌లాడిపోతుంటాయి. అయితే ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వ‌ద్ద భారీ సినిమాల పోటీ నెల‌కొన‌డంతో అంతా ఆస‌క్తిగా సంక్రాంతి పోటీ కోసం ఎదురుచూస్తున్నారు, ఈ పోటీలో ఎవ‌రు గెలుస్తారా? ఎవ‌రి ఓడ‌తారా అనేది ఉత్కంఠ‌గా మారింది. సంక్రాంతి స‌మ‌రం గురువారం సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన `ద‌ర్బార్‌`తో మొద‌లైంది. తొలి ఆట నుంచే ఈ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.

ఆ త‌రువాత బంచ్‌లో మ‌హేష్ న‌టిస్తున్న `స‌రిలేరు నీకెవ్వ‌రు`, అల్లు అర్జున్ న‌టిస్తున్న‌ అల వైకుంఠ‌పుర‌ములో వ‌న్ బై వ‌న్ రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఈ పోటీ నేప‌థ్యంలో యంగ్ హీరో నాగ‌శౌర్య విడుద‌ల చేసిన ఓ వీడియో ఆక‌ట్టుకుంటోంది. `అశ్వ‌థ్ధామ సంక్రాంతి కోడిపందాలు` పేరుతో విడుద‌ల చేసిన వీడియోని విడుద‌ల చేశారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

- Advertisement -

నాగ‌శౌర్య హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం `అశ్వ‌థ్ధామ‌`. సొంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేష‌న్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ర‌మ‌ణ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు, మెహ‌రీన్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి హీరో నాగ‌శౌర్య స్వ‌యంగా క‌థ అందించారు. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్ర ట్రైల‌ర్ సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. కొత్త త‌ర‌హా క‌థాంశంతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ఈ నెల 31న రిలీజ్ చేయ‌బోతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All