Sunday, November 27, 2022
Homeటాప్ స్టోరీస్అశ్వద్ధామ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్

అశ్వద్ధామ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్

అశ్వద్ధామ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్
అశ్వద్ధామ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్

నాగ శౌర్య నటించిన లేటెస్ట్ సినిమా అశ్వద్ధామ రేపు విడుదల కానున్న విషయం తెల్సిందే. మూడు ప్లాపుల తర్వాత నాగ శౌర్య నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా హిట్ కావడం చాలా అవసరం. పైగా ఈ చిత్రానికి తానే కథ అందించడం, నిర్మాత కూడా కావడంతో ఈ సినిమా విజయాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు శౌర్య. మూడు ప్లాపుల తర్వాత చేస్తున్న సినిమా అయినా ఈ చిత్రానికి మార్కెట్ మాత్రం బాగా జరగడం విశేషం. ఇంకా చెప్పాలంటే శౌర్య లాస్ట్ హిట్ ఛలో కంటే ఈసారి బిజినెస్ మెరుగ్గా జరిగింది. అశ్వద్ధామ చిత్రానికి దాదాపుగా 16.2 కోట్ల బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో థియేట్రికల్ బిజినెస్ 10 కోట్లు కాగా, సాటిలైట్, డిజిటల్ మరియు నాన్ థియేట్రికల్ రైట్స్ అన్నీ కలిపి 6.20 కోట్ల దాకా వచ్చినట్లు సమాచారం. సో, అశ్వద్ధామ హిట్ అనిపించుకోవాలంటే థియేట్రికల్ రన్ లో 10 కోట్లను దాటితే చాలు. హిట్ టాక్ వస్తే నాగ శౌర్యకు అదేమంత పెద్ద విషయం కాకపోవచ్చు.

- Advertisement -

ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెల్సిందే. రమణ తేజ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమాజంలో అమ్మాయిలపై జరుగుతున్న అకృత్యాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఫైట్స్ ఈ చిత్రంలో చాలా స్పెషల్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారట. అశ్వద్ధామ సినిమాకు నాగ శౌర్య స్వయంగా కథ అందించడం విశేషం.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts