Homeటాప్ స్టోరీస్అశ్వద్ధామ క్లోజింగ్ కలెక్షన్స్ రిపోర్ట్

అశ్వద్ధామ క్లోజింగ్ కలెక్షన్స్ రిపోర్ట్

అశ్వద్ధామ క్లోజింగ్ కలెక్షన్స్ రిపోర్ట్
అశ్వద్ధామ క్లోజింగ్ కలెక్షన్స్ రిపోర్ట్

యంగ్ హీరో నాగ శౌర్య నటించిన లేటెస్ట్ చిత్రం అశ్వద్ధామ కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అయ్యాయి. కలెక్షన్స్ క్లోజింగ్ స్టేజ్ కి వచ్చాయి. ఇప్పుడు కూడా కలెక్షన్స్ వస్తున్నా అవి నామమాత్రంగానే ఉన్నాయి. వచ్చేవారం భీష్మ రిలీజ్ ఉండడంతో అసలు ఈ సినిమా కలెక్షన్స్ పూర్తిగా క్లోజ్ అవుతాయి. మరి అశ్వద్ధామ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ రిపోర్ట్ ఎలా ఉందంటే.,.

ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.92 కోట్ల షేర్ ను వసూలు చేయగా, వరల్డ్ వైడ్ గా కన్సిడర్ చేస్తే 4.83 కోట్ల షేర్ ను వసూలు చేసాయి. అయితే చిత్ర ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఇంతకు రెండింతలు ఎక్కువే చేసింది. మరి ఈ నేపథ్యంలో మొదటి నుండి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం చివరికి ప్లాప్ గా ముద్ర వేయించుకోనుంది.

- Advertisement -

అశ్వద్ధామ చిత్రాన్ని నాగ శౌర్య చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. స్వయంగా తనే ఈ చిత్ర కథను రాసుకున్నాడు. మన సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని చూసి చలించి దాన్ని బేస్ గా చేసుకుని సినిమా కథను రాసినట్లు తనే స్వయంగా ప్రకటించాడు. అమ్మాయిలపై జరుగుతున్న దారుణాలను ఈ చిత్రంలో చూపించే ప్రయత్నం చేసారు. అయితే సినిమా ఆశించిన మేర జనాల్లోకి వెళ్లలేకపోయింది.

అశ్వద్ధామ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్ :

నైజాం – Rs 1.47 కోట్లు
సీడెడ్ – Rs 46 లక్షలు
గుంటూరు – Rs 27 లక్షలు
ఉత్తరాంధ్ర – Rs 68 లక్షలు
ఈస్ట్ గోదావరి – Rs 32 లక్షలు
వెస్ట్ గోదావరి – Rs 23 లక్షలు
కృష్ణ – Rs 33 లక్షలు
నెల్లూరు – Rs 16 లక్షలు

ఆంధ్ర + తెలంగాణ – Rs 3.92 కోట్లు

కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా – Rs 30 లక్షలు
ఓవర్సీస్ – Rs 61 లక్షలు

వరల్డ్ వైడ్ – Rs 4.83 కోట్లు

రమణ తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నాగ శౌర్య నిర్మించాడు. మెహ్రీన్ కథానాయికగా నటించింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All