Homeటాప్ స్టోరీస్అశ్వద్ధామ నాలుగు రోజుల కలెక్షన్స్ రిపోర్ట్

అశ్వద్ధామ నాలుగు రోజుల కలెక్షన్స్ రిపోర్ట్

Aswathama 4 days collections report
Aswathama 4 days collections report

యంగ్ హీరో నాగ శౌర్య ప్లాన్ చేసి మరీ యాక్షన్ జోనర్ లోకి వెళ్లి కథ రాసుకుని నటించిన సినిమా అశ్వద్ధామ. లాస్ట్ వీకెండ్ విడుదలైన ఈ సినిమా మంచి రేటింగ్స్ తెచ్చుకుని అభిమానుల ఆదరణ కూడా చూరగొంటోంది. అమ్మాయిలపై జరిగే ఆకృత్యాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా విలన్ గా నటించారు. ఆ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండడమే కాకుండా జిషు నటనకు అందరూ ఫిదా అవుతున్నారు.

కొత్త దర్శకుడు రమణ తేజ తెరకెక్కించిన ఈ సినిమాను నాగ శౌర్య సొంతం సంస్థ ఐరా క్రియేషన్స్ నిర్మించింది. మెహ్రీన్ ఈ సినిమాలో కథానాయిక. నాలుగు రోజులకు గాను ఈ చిత్రం 11.95 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసినట్లు చిత్ర వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. అశ్వద్ధామ థియేట్రికల్ హక్కులు 6.5 కోట్లకు అమ్ముడుపోయాయి. రేపటితో ఈ చిత్రం అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ కు చేరుకోనుంది. ఈ చిత్రం ద్వారా మరోసారి నాగ శౌర్య భారీ హిట్ ను చేజిక్కించుకున్నాడు.

- Advertisement -

ఇదే కాకుండా నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా డీసెంట్ అమౌంట్ వచ్చింది. మొత్తంగా నాగ శౌర్య కెరీర్ లో ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోనుంది. ఈ సినిమా ఇంకా డీసెంట్ రన్ కొనసాగిస్తున్న వేళ అశ్వద్ధామ ఇంకెంత వసూలు చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All