Homeటాప్ స్టోరీస్నాగ శౌర్య టాటూ వేయించుకున్నాడంటే ఆ మాత్రం ఉంటుందిగా!

నాగ శౌర్య టాటూ వేయించుకున్నాడంటే ఆ మాత్రం ఉంటుందిగా!

Aswadhama teaser creates interest among audience
Aswadhama teaser creates interest among audience

యువ హీరో నాగ శౌర్య ప్రయాణం టాలీవుడ్ లో పడుతూ లేస్తూ సాగుతోంది. హిట్టు కొట్టినా దాన్ని నిలబెట్టుకునే స్థాయిలో తర్వాతి సినిమాలు ఉండట్లేదు. తన కెరీర్ లో ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద, కళ్యాణ వైభోగమే వంటి హిట్లు ఉన్నాయి. అయితే అవన్నీ పూర్తిగా క్లాస్ తరహాలో సాగే కథలు. తన కెరీర్ లోనే అతిపెద్ద హిట్ ఛలోతో యూత్ లో చక్కని గుర్తింపు తెచ్చుకున్న శౌర్య మళ్ళీ అమ్మమ్మ గారిల్లు, నర్తనశాల వంటి సినిమాలతో వెనుకబడ్డాడు. అయితే ఈసారి క్లాస్ కథతో కాకుండా మాస్ కథతో మన ముందుకు రాబోతున్నాడు శౌర్య.

నిజానికి ఈ హీరో తన కెరీర్ తొలినాళ్లలోనే జాదూగాడు అంటూ ఒక మాస్ సినిమా చేసాడు కానీ అప్పటికి, ఇప్పటికి శౌర్యలో చాలా తేడా వచ్చింది. నటుడిగా పరిణితి సాధించడంతో పాటు శరీరాన్ని కూడా ఫిట్ గా చేసుకున్నాడు. నాగ శౌర్య స్వయంగా కథ అందించిన చిత్రం అశ్వద్ధామ. ఈ చిత్రం తనకు చాలా క్లోజ్. అందుకే గుండెపై ఆ టైటిల్ ను పెర్మనెంట్ టాటూ వేయించుకున్నాడు. తనే కథ అందించడంతో చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడు. రమణతేజ అనే దర్శకుడ్ని పరిచయం చేస్తున్నా శౌర్య కూడా దర్శకత్వంలో ఇన్వాల్స్ అవుతున్నట్లు తెలుస్తోంది. తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లోనే ఈ సినిమా తెరకెక్కుతోంది.

- Advertisement -

ఈ చిత్ర టీజర్ ఈరోజు విడుదలవ్వగా ఇందులో యాక్షన్ పాళ్ళు సమృద్ధిగా  ఉన్నట్లు తెలుస్తోంది. ఒక రాక్షసుడిపై యుద్ధం చేసే యువకుడి పాత్రలో శౌర్య కనిపించనున్నాడు. టీజర్ చూస్తే కథేం రివీల్ చేయలేదు. కాకపోతే జనాలకు ఆసక్తి కలిగించేలా మాత్రం జాగ్రత్త పడ్డారు. శ్రీచరణ్ పాకల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. మెహ్రీన్ కథానాయిక. జనవరి 31న అశ్వద్ధామ విడుదలకానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All