Homeగాసిప్స్ఇక్కడ వెంకీ అక్కడ షారుఖ్..అసురన్ రీమేక్

ఇక్కడ వెంకీ అక్కడ షారుఖ్..అసురన్ రీమేక్

ఇక్కడ వెంకీ అక్కడ షారుఖ్..అసురన్ రీమేక్
ఇక్కడ వెంకీ అక్కడ షారుఖ్..అసురన్ రీమేక్

బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ మరో రీమేక్ పై కన్నేసినట్లు తెలుస్తోంది. వరుస డిజాస్టర్ తో గత కొన్నేళ్లుగా సతమతమవుతున్న బాలీవుడ్ బాద్ షా నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని మంచి కథల కోసం వెతుకుతున్నాడు. అట్లీతో అయితే ఆల్ మోస్ట్ సెట్టయిపోయింది. బిగిల్ హడావుడి తగ్గాక మరికొన్ని రోజుల్లో షారుక్ ని అట్లీ ప్రత్యేకంగా కలవనున్నారు.

వీరి కాంబినేషన్ లో ఎలాంటి సినిమా తెరకెక్కుతుందో తెలియదు గాని కింగ్ ఖాన్ మాత్రం ఒక తమిళ్ సినిమాపై స్పెషల్ గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల ధనుష్ అసురన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 100కోట్లకు పైగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తో మంచి లాభాలని అందించిన ఆ సినిమాను తెలుగులో వెంకటేష్ చేయడానికి సిద్దమయ్యాడు. ఇక బాలీవుడ్ లో చాలా మంది ఈ కథపై కన్నేసినట్లు టాక్ వచ్చింది.

- Advertisement -

అయితే ఫైనల్ గా షారుక్ ఖాన్ అసురన్ చిత్ర యూనిట్ తో డీలింగ్స్ సెట్ చేసుకున్నట్లు సమాచారం. ఆ సినిమాను ఎలాగైనా హిందీలో తనదైన శైలిలో రీమేక్ చేయాలనీ షారుక్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై ఒక స్పెషల్ ఎనౌన్స్మెంట్ వెలువడనుంది. ఇక అట్లీ దర్శకత్వంలో షారుక్ చేయబోయే సినిమా మాత్రం డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All