
హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యవహారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. హైదరాబాద్ డ్రగ్స్ కు అడ్డాగా మారిందనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ ఈ డ్రగ్స్ విషయంలో సీరియస్ గా ఉంది. డ్రగ్స్ కు సంబంధించి ఎవరు దొరికిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు ఆదేశాలు జారీచేయడం తో పోలీసులు వారి దూకుడు ను పెంచారు. ఈ క్రమంలో టాలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్..డ్రగ్స్ సరఫరా చేస్తూ దొరికిపోయాడు.
గంజాయి సరఫరా కేసులో సినీ అసిస్టెంట్ డైరెక్టర్ హాథీరామ్‌ను రాచకోండ పోలీసులు అరెస్టు చేశారు. చాలా కాలం నుంచి సినిమా ఆర్టిస్టులకు హాథీరామ్ గంజాయి సరఫరా చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అతని దగ్గర నుంచి దాదాపు 190 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హాథీరామ్ కొంతకాలంగా కర్ణాటక రాష్ట్రం నుంచి హైదరాబాద్‌కు గంజాయిని సరఫరా చేస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. కురుక్షేత్రం, యుద్ధం శరణం గచ్చామి సినిమాలకు హాథీరామ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు.