
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ నోటీస్ పంపారు. మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ నోటీస్‌లో పేర్కొన్నారు. ఇప్పుడిది చర్చనీయాంశంగా మారింది. ఈటల వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుపట్టారు మంత్రి ప్రశాంత్‌రెడ్డి.. ఆయన క్షమాపణ చెప్పాలని లేదంటే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.
శాసనసభా వ్యవహారాల మంత్రిగా ఈ విషయంలో తాము రూల్స్ ప్రకారం ముందుకెళ్తామన్నారు. మరోసారి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకుండా అడ్డుకునే ప్రయత్నం జరగుతోందని ఈటల రాజేందర్ ఆరోపిస్తున్నారు. ఐతే, సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే నిర్ణయం బీఏసీలో చర్చించాకే తీసుకున్నారని.. కానీ, సీఎం కేసీఆర్ చెప్పినట్లు స్పీకర్ వింటున్నారనేలా ఈటల మాట్లాడడం కరెక్ట్ కాదని అధికారపక్ష నేతలు మండిపతున్నారు.
సీనియర్ సభ్యుడైన ఈటల తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. మార్చిలో శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీజేపీ సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. నాడు హరీష్ బడ్జెట్ ప్రసంగానికి పదేపదే అడ్డుతగిలారనే కారణంతో ఆ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. ప్రస్తుత సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఇచ్చారు. ఐతే.. స్పీకర్‌పై ఈటల వ్యాఖ్యల నేపథ్యంలో ఈసారి ఏం జరుగుతుది.. ఇది క్షమాపణతో ఆగుతుందా.. చర్యలు ఉంటాయా అనేది చర్చనీయాంశమైంది.