
ప్రముఖ టివి యాంకర్, దర్శకుడు ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు ఇండస్ట్రీలో హీరోగా తన మార్క్ ను చూపించడానికి కష్టపడుతున్నాడు. ఇప్పటిదాకా రాజు గారి గది ఫ్రాంచైజ్ తో పాటు పలు సినిమాల్లో నటించిన అశ్విన్ పూర్తిగా ఇమేజ్ మేకోవర్ కు వెళ్ళాడు. బాగా బాడీ పెంచి సాలిడ్ గా కనిపిస్తున్నాడు. అయితే ఇదంతా కొత్త చిత్రం కోసమే.
అశ్విన్ బాబు నటిస్తోన్న కొత్త సినిమా పేరు హిడింబ. రాక్షసి పేరుని పోలి ఉన్న ఈ టైటిల్ ఆసక్తికరంగా ఉంది. అని కన్నెగంటి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో నందిత శ్వేతా హీరోయిన్ గా నటిస్తోంది. గంగపట్నం శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. హిడింబ చిత్రానికి సంబంధించిన పూర్తి విశేషాలు అతి త్వరలోనే తెలుస్తాయి అని అంటున్నారు. దీనికి తోడు అశ్విన్ బాబు రాజు గారి గది నాలుగో చిత్రంలో నటించడానికి సన్నద్ధమవుతున్నాడు.