
‘దిల్’ రాజు సోదరుడి కుమారుడు శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా రెండో సినిమా ఈరోజు శుక్రవారం ప్రారంభమైంది. రౌడీ బాయ్స్ మూవీ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆశిష్..సంక్రాంతి బరిలో వచ్చి పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు సెల్ఫీష్ టైటిల్ తో తన కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. కాశీ విశాల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ మూవీకి క్లాస్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ కూడా ఇందులో భాగమైంది.
ఈ సినిమా ఓపెనింగ్ కు ముఖ్య అతిధులుగా హీరో ధనుష్ , డైరెక్టర్స్ హరీష్ శంకర్ , అనిల్ రావిపూడి , వేణు శ్రీరామ్ లు హాజరయ్యారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా తేలలేదు. తొలి చిత్రంలో క్యూట్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ తో నటించిన ఆశిష్ రెడ్డి..ఈ సారి యంగ్ అండ్ న్యూ హీరోయిన్ తో నటిస్తారని టాక్. సినిమా ఓపెనింగ్ సందర్బంగా ఆశిష్ లుక్ తాలూకా పోస్టర్స్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో స్లీవ్‌లెస్ బ్లాక్ జాకెట్ వేసుకున్న ఆశిష్..స్టైలిష్ గాగుల్స్ పెట్టుకొని కర్లీ హెయిర్, గడ్డంతో ట్రెండ్‌గా తగ్గట్టుగా డిజైన్ చేయబడ్డ బైకును రైడ్ చేస్తున్న స్టిల్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది.
Pics from #Ashish's 2nd film #Selfish Grand opening ceremony!@dhanushkraja @harish2you @AnilRavipudi #SriramVenu & many others graced the event as chief guests.@KasiVishal #DilRaju @MickeyJMeyer @SVC_Official @SukumarWritings @VSHR3555 @DilRajuProdctns pic.twitter.com/EV6bKWvEom
— BA Raju's Team (@baraju_SuperHit) April 15, 2022