Homeప్రెస్ నోట్స్అర్థం: ఆకట్టుకుంటున్న శ్రద్ద దాస్ బర్త్ డే స్పెషల్ పోస్టర్

అర్థం: ఆకట్టుకుంటున్న శ్రద్ద దాస్ బర్త్ డే స్పెషల్ పోస్టర్

అర్థం: ఆకట్టుకుంటున్న శ్రద్ద దాస్ బర్త్ డే స్పెషల్ పోస్టర్
అర్థం: ఆకట్టుకుంటున్న శ్రద్ద దాస్ బర్త్ డే స్పెషల్ పోస్టర్

బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రద్ద దాస్ ప్రధాన పాత్రలో మల్టిలాంగ్వేజ్ మూవీ ‘అర్థం’ రూపొందుతోంది. మణికాంత్ తాళ్లగూటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో  మాస్టర్ మహేంద్రన్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నేడు (మార్చి 4) శ్రద్ద దాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ పోస్టర్‌లో శ్రద్ద దాస్ లుక్ సినిమాపై ఆసక్తి పెంచేస్తోంది. ఇందులో చేతిలో పుస్తకం పట్టుకొని తీక్షణంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది శ్రద్ద దాస్. ఈ చిత్రంలో మాయ అనే సైకియాట్రిస్ట్‌ (మానసిక వైద్య నిపుణురాలు) రోల్‌లో నటిస్తోంది శ్రద్ద. తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ శ్రద్ద క్యారెక్టర్ డిఫైన్ చేస్తూ సినిమాలో ఆమె రోల్ చాలా పవర్‌ఫుల్ అని తెలిపేలా ఉంది.

- Advertisement -

మినర్వా పిక్చర్స్ బ్యానర్‌పై రాధిక శ్రీనివాస్ నిర్మించిన ‘అర్థం’ సినిమాను తమిళం, తెలుగు భాషల్లో తెరెక్కిస్తున్నారు. అలాగే మళయాళ, కన్నడ భాషల్లోకి డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఈ మూవీ మ్యూజికల్ టీజర్‌ సూపర్ రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమా మ్యూజికల్ రైట్స్‌ని టిప్స్ ఫిల్మ్స్ & మ్యూజిక్ చేజిక్కించుకుంది.

ఈ సినిమా ఈ చిత్రం మాయ అనే సైకియాట్రిస్ట్‌ చుట్టూ తిరిగే కథతో ఆధ్యంతం ఆసక్తికరంగా సాగుతుందని డైరెక్టర్ మణికాంత్ తాళ్లగూటి అన్నారు. అరుదైన చర్మ వ్యాధితో బాధపడుతున్న తన పేషెంట్లలో ఒకరైన వైతరణ్ హత్య చేశాడని నమ్మిన ‘మాయ’ అతనితో ఎలా ప్రవర్తిస్తుంది? ఆ హత్య మిస్టరీని ఎలా ఛేదించింది అనే పాయింట్‌తో ఈ సినిమాను రూపొందించామని చెప్పారు. ఈ సినిమాకు తెలుగులో అర్ధం, కన్నడలో అర్థ, అనే టైటిల్స్ ఫిక్స్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. చిత్రంలో అజయ్, ఈటీవీ ప్రభాకర్, జబర్దస్త్ రోషిణి, లోబో, నందా దురైరాజ్, అమని, సాహితి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

సాంకేతిక వర్గం:
సమర్పణ: రిత్విక్ . వీ
బ్యానర్: మినర్వా పిక్చర్స్
నిర్మాత: రాధిక శ్రీనివాస్
దర్శకుడు: మణికాంత్ తాళ్లగూటి
నటీనటులు: శ్రద్ద దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్, ఈటీవీ ప్రభాకర్, జబర్దస్త్ రోషిణి, లోబో, నందా దురైరాజ్, అమని, సాహితి తదితరులు

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All