- Advertisement -
ఓ యువతిని నమ్మించి అత్యాచారం చేయడమే కాకుండా ఆ అత్యాచారం తాలూకు వీడియో కూడా తీసి దాన్ని ఇంటర్నెట్ లో పెడతానని బెదిరించడంతో ఎట్టకేలకు పోలీసులని ఆశ్రయించింది . సదరు యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సినీ నటుడు , టివి నటుడు అయిన కరన్ ఒబెరాయ్ ని అరెస్ట్ చేసారు . మోడల్ , టివి నటుడు అయిన కరన్ ఒబెరాయ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి మొబైల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు .
కరన్ ఒబెరాయ్ మొబైల్ ఫోన్ లో సదరు వీడియోలు ఉండటంతో అతడిపై ఐ పిసి సెక్షన్ 376 , 384 ల కింద కేసు నమోదు చేసారు ముంబై పోలీసులు . కరన్ ఒబెరాయ్ సీరియల్స్ లో నటించాడు . అలాగే మోడల్ గా కూడా వ్యవహరిస్తున్నాడు . పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో కటకటాల పాలయ్యాడు .
- Advertisement -