Homeటాప్ స్టోరీస్బెట్టింగ్ లో 3 కోట్లు పోగొట్టుకున్న సల్మాన్ సోదరుడు

బెట్టింగ్ లో 3 కోట్లు పోగొట్టుకున్న సల్మాన్ సోదరుడు

 Arbaaz Khan booked under cricket betting scamబాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ క్రికెట్ బెట్టింగ్ లో అడ్డంగా బుక్కయ్యాడు , బెట్టింగ్ లో పందెం కాసి ఏకంగా 3 కోట్లు పోగొట్టుకున్నాడు . సంచలనం సృష్టించిన ఈ సంఘటన తో ఒక్కసారిగా బాలీవుడ్ షాకయ్యింది . ఒక్క అర్భాజ్ ఖాన్ మాత్రమే కాకుండా ఇంకా పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ బెట్టింగ్ లో పాల్గొన్నట్లు పోలీసులకు సమాచారం అందింది దాంతో అర్భాజ్ ఖాన్ కు సమన్లు జారీ చేసారు ముంబై పోలీసులు .

అర్భాజ్ ఖాన్ హాట్ భామ మలైకా అరోరా ఖాన్ మాజీ భర్త . అరోరా ఖాన్ తో పెళ్లి రద్దు చేసుకోక ముందు నుండే వాళ్లకు గొడవలు దాంతో విడాకులు తీసుకోవడానికి ముందే రెండేళ్ల పాటు వేరు వేరుగా ఉన్నారు . ఇంకా కలిసి కలహించు కోవడం ఎందుకని విడాకులు తీసుకున్నారు . దాంతో అర్భాజ్ ఖాన్ మానసికంగా దెబ్బతిన్నాడు , అందులో భాగంగానే క్రికెట్ బెట్టింగ్ లో పాల్గొని పోలీసుల సమన్లు అందుకున్నాడు . కట్టుకున్న భార్య నుండి విడాకుల సమస్య కాగా ఇప్పుడేమో బెట్టింగ్ సమస్య మొత్తానికి అర్భాజ్ కు కష్టాలు వచ్చి పడ్డాయి పాపం .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All