
ఈ ఏడాది ప్రారంభంలో `సరిలేరు నీకెవ్వరు` అంటూ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు మహేష్. ఈ మూవీ తరువాత ఆయన నటిస్తున్న తాజా చిత్రం `సర్కారు వారి పాట` చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యంగ్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మహేష్ చాలా రోజుల తరువాత మాస్ లుక్‌లో మరింత స్టైలిష్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే.
ఇటీవల సూపర్‌స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ తో ఆవిషయం స్పష్టమైంది. మైత్రీ మూవీమేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై ప్రారంభానికి ముందే భారీ స్థాయిలో బిజినెస్ కూడా జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. శాటిలైట్, డిజిటల్ బిజినెస్ రికార్డడు స్థాయిలో జరిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా వుంటే భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాల్ని ఎత్తిచూపుతూ ఈ సినిమా సాగనుందని, బ్యాంకింగ్ వ్యవస్థనే ప్రశ్నార్థకంలో పడేసి లక్షల కోట్లు కొట్టేసిన ఓ విలన్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఆ పాత్రలో ఇందకు ముందు కన్నడ స్టార్స్ సుదీప్, ఉపేంద్ర నటిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఫైనల్‌గా ఆ పాత్ర కోసం అరవింద స్దామిని ఫైనల్‌గా ఫిక్స్ చేసినట్టు తాజా సమాచారం. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుంచి స్టార్టయ్యే అవకాశం వుందని తెలిసింది.