HomeINTERVIEWSఆ బాధే న‌న్ను వెంటాడుతోంది!

ఆ బాధే న‌న్ను వెంటాడుతోంది!

ఆ బాధే న‌న్ను వెంటాడుతోంది!
ఆ బాధే న‌న్ను వెంటాడుతోంది!

సినిమాకు సామాజిక బాధ్య‌త వుండాల‌ని, ఇదొక ప‌వ‌ర్‌ఫుల్ మీడియా అని బ‌లంగా న‌మ్మి త‌ను తెర‌కెక్కించే చిత్రాల ద్వారా సందేశాల్ని అందిస్తుంటారు ద‌ర్శ‌కుడు ఎ.ఆర్‌. మురుగ‌దాస్‌. 15 ఏళ్ల నిరీక్ష‌ణ అనంత‌రం త‌లైవా సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా ఆయ‌న రూపొందించిన చిత్రం `ద‌ర్బార్‌`. న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యార్‌పై ఏ. సుభాస్క‌ర‌న్ నిర్మించారు. ర‌జ‌నీ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా నటించిన ఈ చిత్రం ఈ నెల 9న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ఏ.ఆర్‌. మురుగ‌దాస్ శ‌నివారం మీడియాతో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించారు.

*మీతో సినిమా చేయ‌డానికి 15 ఏళ్లు ఎదురుచూశాన‌ని ర‌జినీకాంత్ ప్రీ రిలీజ్ వేడుక‌లో అన‌డం ఎలా అనిపించింది?

- Advertisement -

‘గ‌జినీ’ చిత్రం పెద్ద హిట్ అయిన విషయం తెలిసి ఇంటికి పిలిపించి అభినందించారు. ఆ త‌రువాత ఏడాదికి ఫోన్ చేసి సినిమా చేద్దాం అన్నారు. అయితే ఆ స‌మ‌యంలో నాకు హిందీలో ‘గ‌జిని’ రీమేక్ చేసే అవ‌కాశం వ‌చ్చింది. అది పూర్తి చేసిన త‌రువాత వెంట‌నే సూర్య ఫోన్ చేసి మ‌నం మ‌రో సినిమా చేద్దాం అన్నారు. అలా సూర్య‌తో ‘7 వెంత్ సెన్స్’ చేశాను. ర‌జ‌నీతో సినిమా చేయాలనుకుంటే ఆయ‌న `రోబో` త‌రువాత వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా వున్నారు. ఆ త‌రువాత అనుకున్నా అనారోగ్యం కార‌ణంగా కుద‌ర‌లేదు. చివరికి ఇప్ప‌టికి కుదిరింది. ర‌జ‌నీకి క‌థ న‌చ్చ‌క‌పోతే వెంట‌నే రిజెక్ట్ చేస్తారు. ఆ విష‌యం తెలిసి చాలా వెర్ష‌న్‌లు రాసుకుని చివ‌రికి `ద‌ర్బార్‌` క‌థ‌ని ఫైన‌ల్ చేశాను.

* ర‌జినీని డైరెక్ట్ చేయ‌డం ఎలా అనిపించింది?

చిన్న‌త‌నంలో అమ్మ‌తో క‌లిసి సినిమాకు వెళ్లిన‌ప్పుడు ర‌జ‌నీకాంత్ ఈ థియేట‌ర్లోనే వున్నారా అని వెతికేవాడిని, ఆ త‌రువాత మా అక్క‌వాళ్ల ఇంటికి వెళ్లిన‌ప్పుడు అక్క‌డి థియేట‌ర్ల‌లోనూ ర‌జ‌నీ వున్నాడా అని వెతికా. ఆయ‌నేంటి వాళ్ల ఊళ్లో వుండ‌కుండా ఇక్క‌డున్నాడేంట‌ని అనుకున్నాను. ఆ స‌మ‌యంలో మా అక్క అస‌లు విష‌యం చెప్పారు. ర‌జ‌నీ ఆర్టిస్ట్ అని, ఆయ‌న చెన్నైలో వుంటార‌ని వివ‌రించారు. అప్పుడే నాకు సినిమా గురించి, సినిమా వాళ్ల గురించి తెలిసింది. అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న స‌మ‌యంలో ప‌దిహేను అడుగుల దూరంలో చూశాను. `మ‌న్న‌న్‌` సినిమా టైమ్‌లో చాలా దూరంగా గ‌మ‌నించా. ర‌జ‌నీలో తెలియ‌ని ఎట్రాక్ష‌న్ వుంది. నేను ఆయ‌న‌ని చూసి ఎలా ఫీల‌య్య‌నో నేటి ట్రెండ్‌కి త‌గిన‌ట్లుగా ఆయ‌న‌ని ఈ చిత్రంలో చూపించాను. ప్రేక్ష‌కుల‌కు త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది.

* మీ ప్ర‌తి సినిమాలోనూ ఏదో ఒక సందేశాన్ని అందిస్తుంటారు. అలా ఈ సినిమాలోనూ సందేశాన్ని అందిస్తున్నారా?

ముంబై నేప‌థ్యంలో సాగే పోలీస్ స్టోరీ ఇది. హైద‌రాబాద్‌లో రీసెంట్‌గా జ‌రిగిన ఓ సంఘ‌ట‌న మా సినిమాకు క‌నెక్ట్ అవుతుంది. ఎక్క‌డైనా నేరం జరిగితే అక్క‌డే వారికి శిక్ష‌ప‌డాల‌ని అనుకుంటాం. అలాంటి స‌న్నివేశాన్నే ఈ సినిమాలో చూపించాం. ప్ర‌తి క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో చిన్న సందేశం వుంటే అది ప్ర‌జ‌ల‌కు త్వ‌ర‌గా రీచ్ అవుతుంద‌ని బ‌లంగా న‌మ్ముతుంటాను.

* ర‌జ‌నీతో మ‌ర్చిపోలేని జ్ఞాప‌కం ఏదైనా వుందా?

ఆయ‌న‌తో ప్ర‌తిరోజు మ‌ర్చిపోలేని జ్ఞాప‌క‌మే. ఓ స‌న్నివేశాన్ని చిత్రీక‌రించాలని ప్లాన్ చేశాం. కానీ వ‌ర్షం కార‌ణంగా మూడు రోజులు వాయిదా వేసురోవాల్సి వ‌చ్చింది. అయితే మూడు రోజుల త‌రువాత కూడా వ‌ర్షం త‌గ్గ‌క‌పోవ‌డంతో ర‌జ‌నీ సార్ వ‌ర్షంలోనే షూటింగ్ పూర్తి చేస్తాన‌ని ముంద‌కొచ్చి ఫినిష్ చేయ‌డం మ‌ర్చిపోలేని అనుభూతినిచ్చింది.

* ర‌జ‌నీ నుంచి ఓ ద‌ర్శ‌కుడిగా ఏం నేర్చుకున్నారు?

న‌టుడిగా ఆయ‌న‌ది 40 ఏళ్ల ప్ర‌యాణం. ఈ జ‌ర్నీలో చాలా మంది హీరోలు ఆయ‌న‌తో పోటీప‌డ్డారు. ఈ పోటీని మీరెలా చూస్తార‌ని ఓ రోజు ఆయ‌న‌ని అడిగితే `నేను నా సినిమాల గురించే ఆలోచిస్తాను. ఇత‌రుల సినిమాల గురించి పెద్ద‌గా ఆలోచించ‌ను. ఇత‌ర హీరోల సినిమాలు చూసేప్పుడు ఓ అభిమానిలా చూస్తాను.
సాయంత్రం ఆరు దాటితే సినిమాల గురించి ఆస‌లు ఆలోచించ‌ను. మీరు కూడా మీ గ‌త చిత్రాల్లో ఎలాంటి త‌ప్పులు చేశారో తెలుసుకుంటూ వాటిని అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేయండి` అన్నారు. ఇదే నేను ఓ టెక్నీషియ‌న్‌గా ఆయ‌న నుంచి నేర్చుకుంది.

* న‌య‌న‌తార మీ గురించి గ‌తంలో ఓ కామెంట్ చేశారు విన్నారా?

చాలా ఏళ్ల త‌రువాత మ‌ళ్లీ ఆమెతో కలిసి చేసిన సినిమా ఇది. వ్య‌క్తిగ‌త జీవితంలో ఆమె ఎన్నో ఎదురుదెబ్బ‌లు తిన్నారు. పురుషాధిక్య స‌మాజంలో ఒంట‌రిగా నిలబ‌డి ఈ స్థాయికి రావ‌డం అనేది మామూలు విష‌యం కాదు. ఆ విష‌యంలో ఆమె ఎంతో సాధించింది. ఇక మా ఇద్ద‌రి మ‌ధ్య గ్యాప్ కావాల‌ని ఏర్ప‌డింది కాదు. అలా వ‌చ్చింది. అంతే. సినిమాల్లో ఒక‌రి పాత్ర‌ని కావాల‌ని త‌గ్గిండం, మ‌రొక‌రి పాత్ర‌ని పెటంవ‌చ‌డం అనేది జ‌ర‌గ‌దు. ఏదైనా క‌థని బ‌ట్టే వుంటుంది. `గ‌జిని` విష‌యంలోనూ అదే జ‌రిగింది.

* విల‌న్‌గా సునీల్‌శెట్టిని తీసుకోవ‌డానికి కార‌ణం?

ర‌జ‌నీకాంత్ పాత్ర‌కు ధీటైన విల‌న్ పాత్ర కావాలి. ఆ కార‌ణంగానే సునీల్‌శెట్టిని విల‌న్ పాత్ర కోసం తీసుకున్నాం. ఆయ‌న పాత్ర అద్భుతంగా వుంటుంది.

* తెలుగులో స్ట్రెయిట్ సినిమా ఎప్పుడు?

త‌మిళంలో హీరోల ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తున్నాను. తెలుగులో ఎందుకో అలా చేయ‌లేక‌పోయాను. మ‌హేష్ లాంటి డైరెక్ట‌ర్స్ స్టార్‌తో చేసిన సినిమా ఫ్లాప్ కావ‌డం బాధ‌గానే వుంది. ఆయ‌న‌కు ఫ్లాప్ ఇచ్చానే అనే బాధే న‌న్ను వెంటాడుతోంది. ఇప్ప‌టికీ ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించే విష‌యం ఏంటంటే ఒక ఫ్లాప్ ఇచ్చిన ద‌ర్శ‌కుడితో హీరో అంతా స్నేహంగా వుండ‌రు కానీ మ‌హేష్ మాత్రం ఆ రోజు నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అదే స్నేహ‌పూర్వ‌కంగా వ్య‌వహ‌రిస్తున్నారు.

* `తుపాకి` సీక్వెల్ ఆలోచ‌న‌లు వున్నాయా?
తుపాకి చిత్రానికి సీక్వెల్ చేయాల‌నే ఆలోచ‌న అయితే వుందికానీ దానికి సంంధించిన మంచిఐడియా ఎప్పడు వ‌స్తే అప్పుడు చేస్తాను.

* అల్లు అర్జున్‌తో సినిమా చేసే ఆలోచ‌న వుంద‌ని తెలిసింది?

ప్ర‌స్తుతం టాక్స్ జ‌రుగుతున్నాయి. ఫైన‌ల్ అయ్యాక నేనే చెబుతాను.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All