
భీమ్లా నాయక్ సినిమా విషయంలో ఏపీ సర్కార్ అన్యాయం చేసిన సంగతి తెలిసిందే. బినెఫిట్ షోస్ కు అనుమతి ఇవ్వకపోవడం, టికెట్ ధరలు పెంచకపోవడం వంటివి చేసి నష్టపరిచిన, మిగతా సినిమాలకు మాత్రం బెనిఫిట్ షోస్ కు అనుమతి ఇస్తూనే అదనపు షోస్ కు , టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఇస్తూ ఆ చిత్ర చిత్ర నిర్మాతల్లో ఆనందం నింపుతున్నారు. రాధే శ్యామ్ రిలీజ్ టైం లో ఏపీలో కొత్త జీవో రిలీజ్ చేసి టికెట్ ధరలు పెంచిన సర్కార్..తాజాగా ఆర్ఆర్ఆర్ కు ఏకంగా టికెట్ ధరను వంద కు పెంచుకునే అవకాశం కల్పించింది.
ఈ నిర్ణయంతో సినిమా కలెక్షన్లు మరింత పెరగడానికి అవకాశం ఉంది. ఇప్పటికే ఐదవ షోకి కూడా అనుమతి ఉంది. అలానే బెనిఫిట్ షోలను ప్రదర్శించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు రూ. 550 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని ఏపీలో కూడా అధిక ధరలు అమ్మారు. ఇప్పుడు భారీగా రిటర్న్స్ రావాలంటే టికెట్ ధర చాలా కీలకం. అందుకే భారతదేశంలో అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటైన ‘ఆర్.ఆర్.ఆర్’ కు మద్దతుగా టికెట్ రేట్లు పెంచుకోడానికి జగన్ ప్రభుత్వం అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది.
తాజాగా ఓ ప్రెస్ మీట్ లో దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ ఉక్రెయిన్ గురించి భావోద్వేగానికి గురయ్యారు. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ను ఉక్రెయిన్ లో అద్భుతంగా చేశామని తెలిపారు. ఎంతో ప్రశాంతంగా ఉండే ఆ దేశంలో యుద్ధం వస్తుందని కనీసం ఊహించలేదని చెప్పారు. షూటింగ్ టైమ్ లో ఉక్రెయిన్ ప్రజలు తమకు ఎంతో సహకరించారని తెలిపారు. అక్కడి వంటకాలు, వారి కల్చర్ తనకు ఎంతో నచ్చాయని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ ను కలిసిన తర్వాత తమకు ఎంతో తృప్తి కలిగిందని అన్నారు. జగన్ చాలా సానుకూలంగా స్పందించారని చెప్పారు.