Homeటాప్ స్టోరీస్దసరా ముందు థియేటర్లకు తీపి కబురు అందించిన ఏపీ ప్రభుత్వం

దసరా ముందు థియేటర్లకు తీపి కబురు అందించిన ఏపీ ప్రభుత్వం

దసరా ముందు థియేటర్లకు తీపి కబురు అందించిన ఏపీ ప్రభుత్వం
దసరా ముందు థియేటర్లకు తీపి కబురు అందించిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలవుతున్న నైట్ కర్ఫ్యూను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. రాత్రి 12 గంటల నుండి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది. ఇన్ని రోజులూ రాత్రి 11 గంటల తర్వాత నుండి కర్ఫ్యూ ఉండడంతో నైట్ షోస్ కు అనుమతి లేదు. ఏపీలో మూడు షోస్ మాత్రమే ప్రదర్శించేవారు. దానికి తోడు 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే అనుమతి ఉంది. ఇప్పుడు దాన్ని కూడా సడలించింది.

50 శాతం ఆక్యుపెన్సీను రద్దు చేస్తున్నట్లు జీఓలో పేర్కొంది. అంటే దానర్ధం 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇస్త్తున్నట్లే. ఈ జీఓ రేపటి నుండే అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం టాలీవుడ్ కు పెద్ద ప్లస్ కానుంది. దసరా సందర్భంగా థియేటర్లలో మూడు చిత్రాలు విడుదల కాబోతున్నాయి.

- Advertisement -

మహా సముద్రం ఈ రోజు విడుదల కానుండగా రేపు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్, పెళ్లి సందD చిత్రాలు విడుదలవుతున్నాయి. ఈ మూడు చిత్రాలకు తాజా నిర్ణయం చాలా హెల్ప్ కానుంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థలు స్వాగతించాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రి పేర్ని నానిలకు కృతఙ్ఞతలు తెలుపుతూ స్టేట్మెంట్స్ విడుదల చేసారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All