
ప్రముఖ డిజిటల్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌కు భారీ షాక్ తగిలింది. తెలుగు సినిమా అంటే ఇప్పుడు బెంబేలెత్తిపోతోంది. స్టార్ కాస్ట్ సినిమా అంటే భయంతో వణికి పోతోంది. ఇంతకీ అమెజాన్ భయపడుండటానికి కారణం ఏంటీ? అమెజాన్ ప్రైమ్ తెలుగు సినిమా అంటే ఎందుకు భయపడుతోంది? అంటే బలమైన కారణాలే కనిపిస్తున్నాయి.
లాక్‌డౌన్ కారణంగా సినిమా థియేటర్లు మూసి వేయడంతో వినోదానికి ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు కేరాఫ్ అడ్రస్‌లుగా మారాయి. సగటు మనిషి నుంచి సెలబ్రిటీల వరకు ఇంటి నుంచి బయటకి రాకపోవడం, వినోదానికి ఓటీటీలనే నమ్ముకోవడంతో ఓటీటీ బిజినెస్ మునుపటి కంటే భారీగా పుంజుకుంది. దీంతో స్టార్ కాస్ట్ వున్న చిత్రాల్ని కూడా ఓటీటీల్లో రిలీజ్ చేయడానికి నిర్మాతలు ముందుకొచ్చారు.
అలా వచ్చిన చిత్రాలకు భారీ మొత్తాలు చెల్లించి దక్కించుకుంది అమెజాన్ ప్రైమ్. అలా దక్కించుకున్న సినిమాల్లో నాని, సుధీర్‌బాబు నటించిన `వి` అమెజాన్‌కి చుక్కలు చూపించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ రివేంజ్ డ్రామా ఆశించిన స్థాయిలో వ్యూస్‌ని రాబట్టలేకపోయింది. దీంతో అమెజాన్ భారీ స్థాయిలో నష్టాలని చవిచూడాల్సి వచ్చింది. ఇక తాజాగా అనుష్క నటించిన `నిశ్శబ్దం` చిత్రాన్ని కూడా భారీ మొత్తం చెల్లించి అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. కానీ ఫలితం ఆశించిన స్థాయలో లేకపోవడంతో భారీగానే నష్టాలు వచ్చేలా కనిపిస్తోంది. ఈ నెల 2న రిలీజ్ చేస్తున్నాం అంటూ ప్రకటించిన ఈ చిత్రాన్ని 1న రాత్రి 10 గంటలకే అమెజాన్‌లో పెట్టేశారు. దీన్నీ విమర్శకులు డిజాస్టర్‌గా తేల్చడంతో మెజాన్ వర్గాలు తలపట్టుకుంటున్నాయట. భారీ స్థాయిలో ఈ మూవీ ద్వారా నష్టం వాటిల్లేలా వుందని, ఇక 15 నుంచి థియేటర్స్ రీ ఓపెన్ అవుతుండటంతో వ్యూస్ మరింతగా తగ్గే అవకాశం వుందని భయపడుతున్నారట.