Homeటాప్ స్టోరీస్అనుష్క నిశ్శబ్దంలో ఆ ఐడియా తనదేనట

అనుష్క నిశ్శబ్దంలో ఆ ఐడియా తనదేనట

అనుష్క నిశ్శబ్దంలో ఆ ఐడియా తనదేనట
అనుష్క నిశ్శబ్దంలో ఆ ఐడియా తనదేనట

హీరోయిన్లకు స్టార్ స్టేటస్ దక్కడం అనేది చాలా అరుదు. అయితే అనుష్క శెట్టి మాత్రం గత కొంత కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగుతోంది. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది అనుష్క. అయితే చేసే సినిమాల విషయంలో మాత్రం ఆచి తూచి వ్యవహరిస్తోంది. బాహుబలి తర్వాత భాగమతి చేసిన అనుష్క మరో సినిమా చేయడానికి మరో రెండేళ్లు పట్టింది.

అనుష్క నటించిన నిశ్శబ్దం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు ఓటిటి ప్లాట్ ఫామ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన విషయం తెల్సిందే. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా విడుదలవుతోంది. మొదటగా ఈ సినిమాను మిక్స్డ్ టాక్ రాగా నెమ్మదిగా ఈ సినిమాకు టాక్ పాజిటివ్ గా మారుతోంది.

- Advertisement -

నిశ్శబ్దం దర్శకుడు హేమంత్ మధుకర్ ఈ సినిమా విషయంలో ఒక ఆసక్తికర అంశాన్ని వెల్లడించాడు. నిశ్శబ్దం కథ చెప్పగానే అనుష్క చాలా ఎగ్జైట్ అయ్యిందని, విన్న వెంటనే సినిమా చేస్తున్నామని చెప్పడమే కాకుండా ప్యాన్ ఇండియా రేంజ్ లోనే సినిమాను తీయమని సూచించిందని అతను చెప్పుకొచ్చాడు. అప్పుడైతే ఈ కథకు న్యాయం జరుగుతుందని, భారీ లెవెల్లోనే ఈ సినిమా తీస్తే ఆ రేంజ్ ఉంటుందని అనుష్క చెప్పిందట. ఆ ఐడియాతోనే నిశ్శబ్దం చిత్రాన్ని నాలుగు భాషల్లో విడుదల చేసినట్లు హేమంత్ అన్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All