యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాలిడ్ అందాల బొమ్మాలి అనుష్క కు షాక్ ఇచ్చాడు , ఆ షాక్ తో అనుష్క దిమ్మతిరిగేలా ఉంది . ఇంతకీ ప్రభాస్ ఇచ్చిన షాక్ ఏంటంటే ……. ప్రభాస్ కు హీరోయిన్ లంటే మరీ ఇష్టం , అయితే వాళ్లలో కొంతమంది హీరోయిన్ లంటే మరీ మరీ ఇష్టమట ! ఇంతకీ ప్రభాస్ డార్లింగ్ ఇష్టపడే హీరోయిన్ లు ఎవరో తెలుసా ……. కత్తి లాంటి కత్రినా కైఫ్ , దీపికా పడుకునే , అలియా భట్ లంటే ప్రభాస్ కు చాలా చాలా ఇష్టమట ! వాళ్లతో రొమాన్స్ చేయడానికి ఈ హీరో తహతహలాడుతున్నాడు . తనకు ఇష్టమైన హీరోయిన్ ల లిస్ట్ చెప్పి మిగతా హీరోయిన్ లకు షాక్ ఇచ్చాడు ముఖ్యంగా అనుష్క కు ఇది గట్టి షాక్ అనే చెప్పాలి .
అనుష్క తో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు చేసాడు అంతేగాదు తన సొంత సంస్థ లాంటి యువి క్రియేషన్స్ బ్యానర్ పై భాగమతి అనే సినిమాని తీయించాడు ప్రభాస్ . ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కూడా కుదరడం , పలుమార్లు కలిసి నటించడం వల్ల అనుష్క – ప్రభాస్ లు ప్రేమించుకుంటున్నారని , పెళ్లి కూడా త్వరలో చేసుకుంటున్నారని పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి అయితే ఆ వార్తలను ఎప్పటికప్పుడు ఖండిస్తున్నప్పటికీ మళ్ళీ మళ్ళీ ఆవార్తలు వస్తూనే ఉన్నాయి . ఇక ఇప్పుడు ప్రభాస్ తనకు ఇష్టమైన హీరోయిన్ ల జాబితా చెప్పడంతో అనుష్క కు ఇది నిజంగా షాకింగ్ న్యూసే !