
`బాహుబలి` సినిమా తరువాత అనుష్క పాపులారిటీ పెరిగిపోయింది. గత కొంత కాలంగా ఈ బెంగళూరు భామ పెళ్లిపై వరుస కథనాలు వినిపిస్తూనే వున్నాయి. నాగచైతన్య వివాహానికి ముందు నుంచి అనుష్క పెళ్లి వార్తలు వినిపిస్తూనే వున్నాయి. `బాహుబలి 2` రిలీజ్ తరువాత ఆ పుకార్లు మరీ ఎక్కువయ్యాయి. అనుష్క త్వరలో ప్రభాస్‌ని వివాహం చేసుకోబోతోందని జోరుగా వార్తలు వినిపించాయి. అయితే అందులో ఎలాంటి వాస్తవం లేదని, అవన్నీ వట్టి పుకార్లేనని అనుష్క స్పష్టం చేసినా తన పెళ్లి పుకార్లు మాత్రం ఆగలేదు.
అనుష్క ఓ బిజినెస్‌మేన్‌ని వివాహం చేసుకుంటోందని మళ్లీ వార్తలు జోరుగా వినిపించడం మొదలైంది. అయితే తాజాగా ఈ వార్తలపై స్వీటీ స్పందించింది. ప్రస్తుతం తాను ఎవరితోనూ ప్రేమలో లేనని, ఎవరినీ తాను ప్రేమించడం లేదని స్పష్టం చేసింది. తను ప్రేమలో వున్నానని, తరచూ వార్తలు వినిపిస్తున్నాయని, ఆ వార్తలు విన్నప్పుడు చాలా బాధగా వుంటుంది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు` అని అనుష్క పేర్కొంది.
అనుష్క నటిస్తున్న తాజా చిత్రం `నిశ్శబ్దం`. మాధవన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్, టి.జి. విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 2న ఈ చిత్రం నాలుగు భాషల్లో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భగా మీడియా ముందుకు వచ్చిన అనుష్క ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించడం ఆసక్తికరంగా మారింది.