Homeటాప్ స్టోరీస్అనుష్క పెళ్లిపై మ‌ళ్లీ జోరుగా వార్త‌లు!

అనుష్క పెళ్లిపై మ‌ళ్లీ జోరుగా వార్త‌లు!

Anushka shetty marriage dubai business-man
Anushka shetty marriage dubai business-man

స్టార్ హీరోయిన్ అనుష్క గ‌త ఏడాది న‌వంబ‌ర్ 7తో 39లోకి ఎంట‌రయింది. దీంతో మ‌రోసారి ఆమె పెళ్లిపై వార్త‌లు మొద‌ల‌య్యాయి. గ‌తంలో ఆమె పెళ్లిపై రికార్డు స్థాయిలో క‌థ‌నాలు వినిపించిన విష‌యం తెలిసిందే.  ఆమె ప్రభాస్‌ని వివాహం చేసుకుంటుందని వార్త‌లు వినిపించాయి. అయితే ఆ వార్త‌ల్ని  అనుష్క, ప్రభాస్ ఇద్దరూ ఖండించారు.

ఆ త‌రువాత కూడా అనుష్క పెళ్లిపై వార్త‌లు మాత్రం ఆగ‌లేదు. దర్శకుడు కె. రాఘవేంద్ర రావు కొడుకుతో అనుష్క వివాహం జ‌రుగుతుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఆ త‌రువాత మ‌రో ద‌ర్శ‌కుడితో పెళ్లి జరిగే అవ‌కాశాలు వున్నాయ‌ని కూడా ప్ర‌చారం మొద‌లైంది. తాజాగా ఆమె 39వ ఏట అడుగుపెట్ట‌డంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా అనుష్క పెళ్లి వార్త‌లు మ‌ళ్లీ ఊపందుకున్నాయి.

- Advertisement -

ఈసారి ఆమె దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్తని వివామః చేసుకోబోతోంద‌ని, త‌ను అనుష్క కంటే వ‌య‌సులో చిన్న‌వాడ‌ని ప్రచారం మొద‌లైంది. అనుష్క మాత్రం ఎప్పటిలాగే ఈ పుకార్ల‌పై మౌనం పాటిస్తున్నారు. అనుష్క త్వ‌ర‌లో ‘జాతి రత్నాలు’ ఫేమ్  నవీన్ పొలిషెట్టి తో క‌లిసి ఓ సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. ఇందులో వ‌య‌సు మ‌ళ్లిన యువ‌తిని ప్రేమించే యువ‌కుడిగా క‌థ‌గా ఈ సినిమా వుంటుంద‌ని తెలిసింది. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించ‌బోతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All