
స్వీటీ అనుష్క నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ `నిశ్శబ్దం`. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జీ.విశ్వప్రసాద్ తో కలిసి కోన వెంకట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మాధవన్, షాలిని పాండే, అంజలిలతో పాటు హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడ్సన్ కీలక పాత్రల్లో నటించారు. మూగ, చెవిటి యువతిగా ఓ పెయింటర్‌గా అనుష్క కనిపించనుంది.
ఓటీటీలో ఈ మూవీ అక్టోబర్ 2న రిలీజ్ కాబోతోంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్ ని హీరో రానా సోమవారం రిలీజ్ చేశారు. ఊహించినట్టు ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఓ హాంటెడ్ హౌస్ నేపథ్యంలో కథ ఆసాంతం ఆసక్తికరంగా సాగుతుందని తెలుస్తోంది. ఇందులో మూగ, చెవిటి యువతి సాక్షిగా అనుష్క, మ్యూజీషియన్‌గా మాధవన్ కనిపిస్తుండగా కథకు కీలకమైన పాత్రలో `అర్జున్‌రెడ్డి` ఫేమ్ షాలిని పాండే కనిపించబోతోంది.
షాలినీ పాత్ర చుట్టూ కథ నడుస్తుందని తెలుస్తోంది. మిస్సయిన షాలిని ని కనిపిఎట్టే పోలీస్ ఆఫీసర్లుగా సుబ్బరాజు, అంజలి నటించారు. ఆద్యంతం సస్పెన్స్ అంశాలతో చిత్రాన్ని దర్శకుడు హేమంత్ మధుకర్ మలిచినట్టు తెలుస్తోంది. ఈ మూవీ ఫలితం కోసం చాలా మంది క్రేజీ ప్రొడ్యూసర్స్ ఎదురుచూస్తున్నారు. సినిమా ట్రైలర్‌కి తగ్గట్టే వుండబోతోందా? అన్నది తెలియాలంటే అక్టోబర్ 2 వరకు వేచి చూడాల్సిందే.
Why are you? With @RanaDaggubati #whyareyou? #YRU? #toosid pic.twitter.com/akCNyiEJ9G
— Rana Daggubati (@RanaDaggubati) September 20, 2020
