
అనుష్క నటించిన తాజా చిత్రం `నిశ్శబ్దం`. హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేసిన ఈ థ్రిల్లర్ చిత్రాన్ని కోన వెంకట్‌తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మించారు. ఏప్రిల్ 2న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా ఎఫెక్ట్ కారణంగా విడుదల వాయిదా పడింది. ఇదిలా వుంటే ఈ సినిమా తరువాత అనుష్కని ఓ క్రేజీ ఆఫర్ వరించినట్టు తెలిసింది. 14 ఏళ్ల క్రితం వచ్చిన తమిళ చిత్రం `వేటయాడు వెలియాడు`. కమల్‌హాసన్ నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో `రాఘవన్` పేరుతో రిలీజ్ చేశారు.
రెండు భాషల్లోనూ ఈ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఈ చిత్రం తమిళ, తెలుగు ప్రేక్షకులకు కొత్త తరహా అనూభూతినిచ్చింది. ఈ చిత్రానికి సీక్వెల్‌ని చేయాలని గత కొన్నేళ్లుగా ప్లాన్ చేస్తున్నారు గౌతమ్ మీనన్. అది ఇప్పటికి కార్యరూపం దాల్చుతోంది. రియలిస్టిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా సహజత్వానికి దగ్గరగా తెరకెక్కిన ఈ చిత్ర సీక్వెల్‌ని త్వరలోనే తెరపైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈ సీక్వెల్‌ని వేల్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించబోతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా అనుష్క నటించనుందని తెలిసింది. ఇటీవల దర్శకుడు గౌతమ్ మీనన్ లైన్ వినిపించాడని. స్టోరీ నచ్చడంతో అనుష్క గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. కమల్‌హాసన్ ప్రస్తుతం `ఇండియన్ 2` చిత్రంలో నటిస్తున్నారు. ఇది పూర్తయిన తరువాతే `రాఘవన్` సీక్వెల్ ప్రారంభం కానుందని కోలీవుడ్ న్యూస్.