
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ… టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ వండర్ బాహుబలి చిత్రం తరువాత అనుష్క గారు నటించిన చిత్రం మా భాగమతి. ఇప్పటికే విపరీతమైన క్రేజ్ వున్న ఈ చిత్రం అందరి అంచనాలకు అందుకునేలా వుంటుంది. ప్రపంచవ్యాప్తంగా దేవసేన గా అభిమాన ధనాన్ని సంపాయించుకున్న అనుష్క నటించిన ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో 10 మిలియన్ వ్యూస్ రావటం ఈచిత్రం పై ప్రేక్షకుల అంచనాలు తెలుస్తుంది. అనుష్క నటన, దర్శకుడు అశోక్ టేకింగ్, మథి కెమెరా వర్క్, అబ్బుర పరిచే రవీందర్ ఆర్ట్ వర్క్, తమన్ రీ రికార్డింగ్, నిర్మాణాత్మక విలువలు హై స్టాండర్డ్స్ లో ఉంటాయి. ఇది ఏ ఓక్క భాషకి సంభందించిన కథ కాదు. యూనివర్సల్ సబ్జక్ట్. తప్పకుండా ఏ భాషలో అయినా హ్యమన్ ఎమెషన్ ఒక్కటే కాబట్టి ఈ చిత్రాన్ని సౌత్ ఇండియా మెత్తం అన్ని భాషల్లో విడుదల చేస్తున్నాం. ప్రమెషన్ లో భాగంగా కేరళ కి వచ్చాము. కేరళ లో అనుష్క గారికి చాలా పెద్ద ఫ్యాన్ బ్యాంక్ వుంది. అదేవిధంగా ఉన్ని ముకుందన్ లాంటి మళయాల స్టార్ కూడా నటించారు. ఇంకా చాలా మంది మళయాల నటీనటులు నటించటంతో కేరళ సినిమా ప్రేక్షకులు తప్పకుండా ఈ చిత్రాన్ని హ్రుదయానికి దగ్గరగా తీసుకున్నారు. తప్పకుండు ఈ చిత్రం అన్ని భాషల్లో ఘనవిజయం సాధిస్తుందని మా నమ్మకం. అని అన్నారు.
దర్శకుడు అశోక్ మాట్లాడుతూ.. నా కెరీర్ లో ఇంత పెద్ద అవకాశాన్ని అందించిన నిర్మాతలు వంశి, ప్రమెద్, విక్రమ్ లకి నా హ్రుదయపూర్వక ధన్యవాదాలు.. వీరిని నేను త్రీమూర్తులు అంటుంటాను. అయితే నాకు ఇంత శక్తిని అందించింది మాత్రం అనుష్క గారు. ఈ చిత్రానికి ప్రాంతం, భాష లేదు..హ్యమన్ ఎమెషన్ మాత్రమే వుంది. ప్రతిఒక్కరు అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని చూసి ఆనందిస్తారు. తప్పకుండా సర్‌ప్రైజ్ అవుతారు. భాగమతి చిత్రంలో నటించిన నటీనటులందరూ మరియు సాంకేతికి నిపుణులు అందరూ ఈ చిత్రంలో పాత్రల్లా చేశారు. మెము వేసిన బంగ్లా సెట్ చిత్రం లో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే థమన్ గారి రీ-రికార్డింగ్, మాటలు, ఎఫెక్ట్స్ , ప్రోడక్షన్ వాల్యూస్ ఇలా ప్రతి ఓక్కరి కష్టం చూసిన ప్రతి ప్రేక్షకుడ్ని ఆకట్టుకుంటుంది. అని అన్నారు
హీరోయిన్ అనుష్క మాట్లాడుతూ.. నాకు ఇలాంటి ఓ మంచి అవకాశాన్ని ఇచ్చిన యు వి క్రియెషన్స్ వంశి, ప్రమెద్, విక్రమ్ లు నా థ్యాంక్స్. నా పెయిర్ గా నటించిన ఉన్ని ముకుందన్ గారికి నా థ్యాంక్స్. నన్ను ఇంత బాగా చూపించిన సినిమాటోగ్రాఫర్ మధి గారికి థ్యాంక్స్. కేరళ కి ప్రమెషన్ కి రావటం చాలా హ్యపి గా వుంది. అందరికి ఈ చిత్రం నచ్చుతుందని ఆశిస్తున్నాను. అలాగే దర్శకుడు అశోక్ చాలా బాగా నేరేట్ చేశారు, అదే రేంజి లో తీసారు. ఆర్ట్ రవిందర్ గారు వర్క్ ఈచిత్రంలో చాలా కీలక పాత్రలో కనిపిస్తుంది. జనవరి 26న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రానుంది. అని అన్నారు.
- Advertisement -