
ప్రేమమ్ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్ ముందు హిట్స్ తో ఆరంభమైనా తర్వాత వరస ప్లాపులతో డీలా పడింది. అయితే గతేడాది రాక్షసుడు సినిమాతో సూపర్ హిట్ ను అందుకుంది ఈ భామ. ఆ తర్వాత తమిళ, మలయాళ సినిమాలు, వెబ్ సిరీస్ ల మీద కాన్సన్ట్రేట్ చేసింది.
మళ్ళీ ఇప్పుడు తెలుగు సినిమాలపై తన ఫోకస్ ను పెట్టింది. నిఖిల్ హీరోగా నటిస్తోన్న 18 పేజెస్ సినిమాలో అనుపమ హీరోయిన్ గా ఎంపికైన విషయం తెల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అనుపమ లేటెస్ట్ గా షూటింగ్ స్పాట్ నుండి ఫోటోలను షేర్ చేసింది.
పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో కుమారి 21ఎఫ్ సినిమాతో సూర్య ప్రతాప్ ఫేమ్ ను సంపాదించుకున్నాడు. బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సుకుమార్ ఈ సినిమాను సమర్పిస్తున్నాడు. ఒక విభిన్నమైన కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది.