Homeటాప్ స్టోరీస్'అను' ఆశలన్నీ రావణాసుర పైనే...

‘అను’ ఆశలన్నీ రావణాసుర పైనే…

anu emmanuel hopes to Ravanasura
anu emmanuel hopes to Ravanasura

న్యాచురల్ స్టార్ నాని హీరోగా 2016లో వచ్చిన `మజ్ను` మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్. మొదటి మూవీ తోనే చక్కటి నటన కనపరిచి ఆకట్టుకుంది. ఆ తర్వాత అమ్మడికి వరుస ఛాన్సులు వచ్చినప్పటికీ హిట్స్ మాత్రం దక్కలేదు. దీంతో ఛాన్సులు చాల తగ్గిపోయాయి. ప్రస్తుతం రవితేజ హీరో గా నటిస్తున్న రావణాసుర పైనే అమ్మడు ఆశలు పెట్టుకుంది.

క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ ఆర్టీ టీం వర్క్స్ బ్యానర్లపై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా కథ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ రవితేజ కెరీర్లో 70వ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. ఇందులో అక్కినేని సుశాంత్ కీలక పాత్ర పోషిస్తుండగా.. అను ఇమ్మన్యూయేల్ , ఫరియా అబ్దుల్లా, పూజిత, మేఘా ఆకాశ్, దక్షా నగర్కార్ హీరోయిన్లుగా చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ దసరా తర్వాత రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక ఈ మూవీ ఫై అను భారీ ఆశలు పెట్టుకుంది. మరి ఈ సినిమా ఆమెకు ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All