Thursday, October 6, 2022
Homeటాప్ స్టోరీస్230 కోట్లు వసూల్ చేసే దమ్ము మహేష్ కుందా ?

230 కోట్లు వసూల్ చేసే దమ్ము మహేష్ కుందా ?

- Advertisement -

230 కోట్లు వసూల్ చేసే దమ్ము మహేష్ బాబు కు ఉందా ? ఉంటే మహర్షి బ్లాక్ బస్టర్ పో ……. అని ఛాలెంజ్ చేస్తున్నారు మహేష్ బాబు యాంటీ ఫ్యాన్స్ . మహర్షి చిత్రం బ్లాక్ బస్టర్ కావాలంటే నిజంగానే 230 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించాలి అప్పుడే 120 కోట్ల షేర్ వస్తుంది . 120 కోట్ల షేర్ వస్తేనే మహర్షి చిత్రాన్ని కొన్నవాళ్ళు అంటే బయ్యర్లు లాభాల బాటలోకి వచ్చేది . ఇప్పుడున్న పరిస్థితుల్లో మహర్షి వసూళ్ల ని సాధించడం కష్టం కాకపోవచ్చు ఎందుకంటే మహర్షి సెన్సార్ టాక్ బాగానే ఉంది

అలాగే మహర్షి చిత్రానికి పోటీ కూడా లేకుండాపోయింది దాంతో ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రావడం ఖాయం . అయితే 230 కోట్ల గ్రాస్ 120 కోట్ల షేర్ వస్తుందా ? అనేదే ప్రశ్న . ఎందుకంటే భరత్ అనే నేను చిత్రం గత ఏడాది విడుదలై 187 కోట్లు మాత్రమే వసూల్ చేసింది . పైగా కొంతమంది బయ్యర్లు స్వల్ప నష్టాలను చవిచూశారు కూడా . దాంతో మహేష్ యాంటీ ఫ్యాన్స్ మీ హీరోకు 230 కోట్ల వసూళ్లు సాధించే దమ్ము ఉందా ? అని ఛాలెంజ్ చేస్తున్నారు . మరి మహేష్ వసూళ్ల ని సాధిస్తాడా ? ఛాలెంజ్ కు బదులు చెబుతాడా ? యాంటీ ఫ్యాన్స్ నోళ్లు మూయిస్తాడా ? మే 9 తేలనుంది ఫలితం

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts