Homeన్యూస్అంతర్వేదమ్ రివ్యూ

అంతర్వేదమ్ రివ్యూ

antharvedham reviewఅంతర్వేదమ్ రివ్యూ :
నటీనటులు : అమర్ , సంతోషి , షాలు చౌరస్య , తనికెళ్ళ భరణి ,పోసాని
సంగీతం : జె ఎస్ నిదిత్
నిర్మాణం : ఫ్రెండ్స్ ఫండింగ్ ఫిలిమ్స్
దర్శకత్వం : చందిన రవికిశోర్
రేటింగ్ : 3/5
రిలీజ్ డేట్ : 21 సెప్టెంబర్ 2018

తాళపత్ర గ్రంథాల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం అంతర్వేదమ్ . కొంతమంది స్నేహితులు కలిసి తలాకొంత వేసుకొని ఫ్రెండ్స్ ఫండింగ్ ఫిలిమ్స్ అనే బ్యానర్ ని స్థాపించి రూపొందిన చిత్రం ఈ అంతర్వేదమ్ . అమర్ , సంతోషి , షాలు చౌరస్య , రవి , లడ్డు , యోగి , తనికెళ్ళ భరణి ,పోసాని , జబర్దస్త్ మహేష్ , దొరబాబు తదితరులు నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా ఉందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే .

- Advertisement -

కథ :

పంచభూతాలు తనపైన పగబట్టి చంపబోతున్నట్లుగా కల కంటుంటాడు అమర్ ( అమర్ ) . అయితే అయిదుసార్లు కలలో చంపిన తర్వాత నిజంగానే చనిపోతానని భయపడుతున్న అమర్ తనకు వచ్చిన కల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు . అయితే అమర్ మిత్రుడు శాస్త్రి కి ఈ విషయం తెలిసి సైకియాట్రిస్ట్ కు చెబుతాడు దాంతో తిరువనంతపురం వెళ్ళమని నేను వారం రోజుల్లో ఫారిన్ కెళ్ళి మళ్ళీ వస్తానని చెబుతాడు . దాంతో అమర్ తన మిత్రుడితో కలిసి తిరువనంతపురం వెళ్తాడు . అక్కడ తాళపత్ర గ్రంధాలు పూజారి ఇవ్వడంతో దాని ప్రకారం పూజలు చేస్తాడు . అయితే దశలు మారేకొద్దీ అమర్ తో పాటుగా మరికొంతమంది కలుస్తుంటారు . అలా కలిసేవాళ్ళు ఎవరు ? వాళ్లకు ఉన్న సమస్యలు ఏంటి ? అమర్ తన సమస్య ని అధిగమించాడా ? చివరకు ఏమైంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

తాళపత్ర గ్రంథాల ఇతివృత్తం ని ఎంచుకోవడం

డ్రా బ్యాక్స్ :

స్క్రీన్ ప్లే

నటీనటుల ప్రతిభ :

పోసాని , తనికెళ్ళ భరణి , జబర్దస్ మహేష్ , దొరబాబు లు మినహా మిగతావాళ్లంతా కొత్తవాళ్లు అయినప్పటికీ కొత్తవాళ్లు అన్న ఫీలింగ్ కలగనీయలేదు . ఎవరికి వాళ్ళు తమతమ పాత్రల పరిధిమేరకు బాగానే నటించారు . అమర్ , సంతోషి , షాలు చౌరస్య , రవి , లడ్డు , యోగి తదితరులంతా బాగానే నటించారు . తనికెళ్ళ భరణి లాంటి సీనియర్ నటుడు ఈ చిత్రంలో చేయడం మరో విశేషం .

సాంకేతిక వర్గం :

క్రౌడ్ ఫండింగ్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రవికిశోర్ ఉన్నంతలో బాగానే హ్యాండిల్ చేసాడు . మొదటగా ఈ ఇతివృత్తాన్ని ఎంచుకోవడం అభినందనీయం . ఈ కాన్సెప్ట్ తో సినిమా తీయాలన్న అతడి ఆలోచనని మెచ్చుకోవలసిందే . అయితే స్క్రీన్ ప్లే పరంగా అనుభవలేమి స్పష్టంగా కనిపిస్తూనే ఉంది . కాస్త జాగ్రత్తపడితే ఇంకా బాగుండేది . నిర్మాణ విలువలు ఫరవాలేదు . తక్కువ బడ్జెట్ లోనే మంచి ఔట్ పుట్ ఇచ్చారు .

ఓవరాల్ గా :

విభిన్న తరహా చిత్రాలను కోరుకునే వాళ్లకు అంతర్వేదమ్ మంచి ఛాయిస్ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All