Sunday, November 27, 2022
Homeన్యూస్అంత‌కు మించి` మూవీ రివ్యూ!!

అంత‌కు మించి` మూవీ రివ్యూ!!

anthaku minchi review

- Advertisement -

న‌టీన‌టులుః జై, ర‌ష్మీ గౌత‌మ్, అజ‌య్ ఘోష్‌, మ‌ధునంద‌న్, టీవీ 9 హ‌ర్ష‌, టియ‌న్ ఆర్
ద‌ర్శ‌క‌త్వంః జానీ
నిర్మాత‌లుః జై స‌తీష్‌, ప‌ద్మ‌నాభ‌రెడ్డి
సంగీతంః సునీల్ క‌శ్య‌ప్‌
సినిమాటోగ్ర‌ఫీః బాలిరెడ్డి
స్క్రీన్ ప్లేః జాని
ఎడిట‌ర్ః క్రాంతి

జై, ర‌ష్మి గౌత‌మ్ జంట‌గా న‌టించిన చిత్రం `అంత‌కు మించి` ఎస్ జై ఫిలిమ్స్ ప‌తాకంపై యూ అండ్ ఐ ఎంట‌ర్టైన్మెంట్స్ స‌మ‌ర్ఫ‌ణ‌లో రూపొందిన ఈచిత్రం ద్వారా జానీ అనే ద‌ర్శ‌కుడు ప‌రిచ‌యం అయ్యారు. జై హీరోగా న‌టిస్తూ నిర్మించారు. పోస్ట‌ర్స్, టీజ‌ర్, ట్రైల‌ర్ ఈ చిత్రానికి మంచి హైప్ తీసుకొచ్చి ఆడియ‌న్స్ లో అంచ‌నాలు ఏర్ప‌రిచింది. మ‌రి ఈ శుక్ర‌వారం విడుద‌లైన ఈ చిత్రం ఆడియ‌న్స్ అంచాన‌ల‌కు అందుకునే విధంగా ఉందా లేదా అని తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం…

స్టోరీ విష‌యానికొస్తే…
ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు రాజు ( జై) క‌ష్ట ప‌డ‌కుండా కోటీశ్వ‌రుడై పోయి లైఫ్ ని ఎంజాయ్ చేయాల‌నుకునే ర‌కం. మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు షోలో పాల్గొని కోటీశ్వ‌రుడు అయిపోవాల‌నుకుని దానికి సంబంధించిన ప్రాసెస్ తెలుసుకునే క్ర‌మంలో `దెయ్యం ఉంద‌ని నిరూపిస్తే ఐదు కోట్లు ఇస్తాన‌ని ఓ ప్రొఫెస‌ర్ ఇచ్చిన ఓ ప్ర‌క‌ట‌న‌ను ఇంట‌ర్ నెట్ చూస్తాడు. ఇదేదో బాగుంద‌ని హీరో… ద‌య్యాలున్నాయ‌ని నిరూపించి ఆ ఐదు కోట్టు కొట్టేయాల‌ని స్మ‌శానాల చుట్టూ తిరుగుతుంటాడు. ఈ క్ర‌మంలో ఒక ఫామ్ హౌస్ లో ఉంటున్న త‌మ సోద‌రి ఇంట్లో దెయ్యాల‌నున్నాయని తెలుసుకుని అక్క‌డకు వెళ్తాడు. ఈ క్ర‌మంలో మూడ‌న‌మ్మాకాలు నమ్మ‌ని బ్యాచ్ ఒక‌టి ఆ ఇంట్లోకి వ‌స్తారు. అందులో మ‌ధుప్రియ (ర‌ష్మి) ఉంటుంది. మొద‌టి చూపులోనే ఆ అమ్మాయిని ఇష్ట‌ప‌డ‌తాడు రాజు. మ‌రి అక్క‌డ అస‌లు దెయ్యం ఉందా? లేదా? హీరోయి అయిదు కోట్లు ప్రైజ్ మ‌నీ అందుకున్నాడా? మ‌ధుప్రియ అక్క‌డ దెయ్యాలు లేవ‌ని నిరూపించిందా? అస‌లు చివ‌ర‌కు ఏమైంది అన్న‌ది చిత్ర క‌థాంశం.

న‌టీన‌టుల ప‌ర్ఫార్మెన్స్ః

హీరో జై ఫ‌స్ట్ టైమ్ అయినా ఎక్క‌డా బెరుకు లేకుండా ఎంతో ఎక్స్ పీరియ‌న్స్ ఉన్న హీరోలా న‌టించాడు. డ‌బ్బు కోసం ఏదైనా చేసే ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు పాత్ర‌లో ఒదిగిపోయాడు. ముఖ్యంగా దెయ్యం ఉంద‌ని ప్రూవ్ చేసే స‌న్నివేశాలు, రొమాంటిక్ స‌న్నివేశాల్లో ఎంతో కాన్ఫిడెన్స్ గా న‌టించాడు. హీరోతో పాటు నిర్మాత కూడా త‌నే అయినా…ఎక్క‌డా హీరో యిజం జోలికి పోకుండా క‌థ ప్ర‌కారం సినిమాలో ఎటువంటి బిల్డ‌ప్ సీన్స్ లేకుండా నాచ‌ర‌ల్ గా ఉండేలా చూసుకున్నారు. ఈ విష‌యంలో హీరోని అభినందించాలి. భ‌విష్య‌త్ లో మంచి మీరోగా ఎదిగే ల‌క్ష‌ణాలు త‌న‌లో మెండుగా ఉన్నాయి. అలాగే ఇప్ప‌టి వ‌ర‌కు ర‌ష్మి అన‌గానే ఏదో గ్లామర్ కోసం అనుకునే వారంతో ఈ సినిమాలో గ్లామ‌ర్ తో పాటు చ‌క్క‌టి న‌ట‌న క‌న‌బ‌రిచింది. త‌న స్క్రీన్ ప్ర‌జెన్స్ తో తో పాటు నెగిటివ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో క్లైమాక్స్ లో త‌న న‌ట‌నేంటో ప్రూవ్ చేసుకుంది. హీరో హీరోయిన్ కు మ‌ధ్య మంచి కెమిస్ట్రీ వ‌ర్కవుట్ అయింది. అలాగే క‌మెడియ‌న్ మ‌ధునంద‌న్ కామెడీ టైమింగ్ తో మంచి ఎంట‌ర్ టైన్ చేశాడు. సూర్య , అజ‌య్ ఘోష్ త‌మ త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల ప‌నితీరుః
హ‌ర్ర‌ర్ చిత్రాల‌కు మంచి మ్యూజిక్ , సినిమాటోగ్ర‌ఫీ చాలా అవ‌స‌రం. మ‌రి సునీల్ క‌శ్య‌ప్ అందించిన నేప‌థ్య సంగీతం తో పాటు బాల్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ సినిమాను నెక్ట్స్ లెవ‌ల్ కు తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేశాయి. ద‌ర్శ‌కుడు మంచి లైన్ అయితే ఎంచుకున్నాడు కానీ , దాన్ని ఎగ్జిక్యూట్ చేయ‌డంలో త‌డ‌బ‌డ్డాడు. ఇంకా ప‌ర్ ఫెక్ట్ స్క్రీన్ ప్లే తో , లూప్ హోల్స్ లేకుండా ప‌క్కాగా తీస్తే …అంత‌కు మించి ఉండేది అన‌డంలో సందేహం లేదు. ఎడిటింగ్ కూడా ఇంకొంచెం షార్ప్ గా ఉండాల్సింది. డైర‌క్ట‌ర్ ఆర్టిస్టుల నుంచి ప‌ర్ఫార్మెన్స్ తీసుకోవ‌డంలో పాస్ మార్కులు కొట్టేశాడు. అయితే జై, ప‌ద్మ‌నాభ‌రెడ్డి ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ బాగున్నాయి. ఎక్క‌డా రాజీ ప‌డ్డ‌ట్టు క‌నిపించ‌లేదు.

ఫైన‌ల్ గా చెప్పాలంటేః
జై , ర‌ష్మీ గౌత‌మ్ ల ప‌ర్పార్మెన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచే అంశాలు. మ్యూజిక్, సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు అద‌న‌పు ఆకర్ష‌ణ‌లు. సినిమాను జై, ర‌ష్మీ ఇద్ద‌రూ త‌మ ప‌ర్ఫార్మెన్స్ తో ఓ లెవల్ కి తీసుకెళ్తూ…హ‌ర్ర‌ర్ సినిమాల్లో అంత‌కు మించి అనిపించారు. కాకుంటే సినిమా అక్క‌డ‌క్క‌డా మెల్ల‌గా ర‌న్ అవుతూ బోర్ అనిపించింది. సినిమా లైన్ ప్ర‌కారం బాగున్నా …ఇంకా క‌న్విన్సింగ్ చెప్ప‌డంలో ద‌ర్శ‌కుడు ఇంకా కొంచెం శ్ర‌ద్ద పెట్టాల్సింది. హ‌ర్ర‌ర్ చిత్రాల‌ను ఇష్ట‌ప‌డే వారికి క‌చ్చితంగా ఈ సినిమా న‌చ్చుతుంది. ఎందుకంటే అక్క‌డ‌క్క‌డా భ‌య‌పెడుతూ… న‌వ్విస్తూ ఎంట‌ర్ టైన్ చేస్తుంది. కాబ‌ట్టి ఫ్యామిలీతో క‌లిసి ఈ సినిమాను హ్యాపీగా చూడ‌వ‌చ్చు. సో గో అండ్ వాచ్

ఒక్క మాట‌లో చెప్పాలంటేః ఈ వారం ఇంత‌కు మించిన సినిమా లేదు!!
రేటింగ్ః 3/5

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts