
శ్యామ్ సింగరాయ్ మూవీ తో సూపర్ హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నాని..ప్రస్తుతం వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో అంటే సుందరానికి అనే మూవీ చేస్తున్నాడు. బ్రోచేవారేవరురా సినిమాతో హిట్ అందుకున్న వివేక్ ఆత్రేయ ఈ మూవీ లో నాని ని డిఫరెంట్ గా చూపించబోతున్నాడు. ఇందులో నాని సరసన మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా తో తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెడుతున్న ఈ భామ ..ఈ మూవీ ఫై భారీ ఆశలే పెట్టుకుంది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 10 న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ తరుణంలో సినిమా ప్రమోషన్ ఫై దృష్టి సారించారు. రీసెంట్ గా పంచె సాంగ్ ను విడుదల చేసి ఆకట్టుకోగా..తాజాగా చిత్ర టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసారు. ఈనెల 20న ఉదయం 11.07 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు తెలుపుతూ విడుదల చేసిన పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో ఒక పోస్టర్లో సుందర్, లీలా హిందూ సంప్రదాయ పద్ధతిలో, మరో పోస్టర్లో వెస్ట్రన్ పెళ్లి దుస్తుల్లో కన్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.