Homeన్యూస్RC15 నుండి మరో లీక్..తలలు పట్టుకుంటున్న మేకర్స్

RC15 నుండి మరో లీక్..తలలు పట్టుకుంటున్న మేకర్స్

RC15 నుండి మరో లీక్..తలలు పట్టుకుంటున్న మేకర్స్
RC15 నుండి మరో లీక్..తలలు పట్టుకుంటున్న మేకర్స్

సినిమా ఇండస్ట్రీ కి లీకులు అనేది పెద్ద సమస్య గా మారింది. రిలీజ్ తర్వాత పైరసీ తో బాధపడడం ఒకెత్తు అయితే..చిత్ర నిర్మాణంలో ఉండగా స్టిల్స్ , సన్నివేశాలు , సాంగ్ షూట్ వీడియోస్ ఇలా కీలక మైనవి లీక్ కావడం మరోఎత్తు అయ్యింది. పెద్ద సినిమాల విషయంలో ఈ లీకుల పర్వం ఎక్కువగా కొనసాగుతూ వస్తుంది. ప్రస్తుతం రామ్ చరణ్ – శంకర్ కలయికలో తెరకెక్కుతున్న RC15 లీకుల బెడద తప్పడం లేదు. ఇప్పటికే పలు  పిక్స్ లీక్ కావడం తో మేకర్స్ లీక్ రాయుళ్లకు వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ లీక్ రాయుళ్లు వారి పని వారు చేస్తూ వస్తున్నారు.

ప్రస్తుతం రాజమండ్రి లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది.  మొన్న ఫోటోలు లీక్ అయితే.. నేడు ఓ వీడియోనే లీకైంది. రంగస్థలం సినిమాలో మాదిరిగా రామ్ చరణ్ సైకిల్ మీద ప్రయాణం చేస్తున్నాడు. వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో రామ్ చరణ్ సైకిల్ తొక్కుతున్న వీడియోలు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.మరి ఈ లీకులపై దిల్ రాజు ఎలాంటి చర్యలు తీసుకుంటాడో చూడాలి.

- Advertisement -

ఇక ట్విట్టర్‌లో అయితే రామ్ చరణ్ సైకిల్ సవారికి సంబంధించిన వీడియోలు తెగ చక్కర్లు కొడుతోంది. దిల్ రాజు బ్యానర్ లో పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో చరణ్ కు జోడిగా కియారా అద్వానీ నటిస్తుండగా..శ్రీకాంత్ , అంజలి లు కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All