Homeటాప్ స్టోరీస్మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో వస్తున్నాడు

మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో వస్తున్నాడు

another hero from mega family మెగా ఫ్యామిలీ లో ఇప్పటికే పలువురు హీరోలు ఉండగా, హీరోలు మాత్రమే కాదు హీరోయిన్ లు కూడా వస్తారు అంటూ నిహారిక తెరంగేట్రం చేసింది . కాగా ఇప్పుడు మరో హీరో మెగా కుటుంబం నుండి రావడానికి రంగం సిద్ధం అవుతోంది . మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ని హీరోగా పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . అవసరాల శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది .

వైష్ణవ్ తేజ్ బాలనటుడి గా మన తెలుగు ప్రేక్షకులకు పరిచయమే ! చిరంజీవి హీరోగా నటించిన ” శంకర్ దాదా ఎం బిబిఎస్ ” చిత్రంలో వీల్ చెయిర్ లో అచేతనంగా ఉండే బాలుడి పాత్ర ని పోషించింది ఈ వైష్ణవ్ తేజ నే ! ఇతడ్ని హీరోగా పరిచయం చేయాలనీ చాలామంది ప్రయత్నాలు చేస్తుండటంతో డ్యాన్స్ లో ఫైట్స్ లలో అలాగే నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు వైష్ణవ్ తేజ్ . ఇతడి రాకతో డజన్ మంది హీరోలు అయ్యేలా ఉంది మెగా ఫ్యామిలీ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All